పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

63

కారి యగును. సోదరులుండగా సోదరీమణులకు పిండ ప్రదానాధికార ముండదు. కనుక వారికి ధనాధికారము కూడ లేదు. కాని భర్త యాస్తి యందు మాత్రమామె కధికార మున్నది. దానివలననే స్త్రీ పోషింపబడ వలయును, భర్త తోడనే ఆమె జీవనయాపన జేసుకొనవలయును. వారిలో ఆర్థిక విషయము వేరైన సంబంధమును వేరగును. తన్మూలమున ద్వేషము బయల్వెడలి జీవితము దుఃఖమయ మగును. గర్వ మనునది సేవాభావమునకు విరోధి.

పతి, మామ, అత్త, తోటికోడలు, మరది మున్నగు వారితోడ విరోధము సంభవించినపుడు స్త్రీ చేతులలో సంపద యున్న సదాచారముకంటె దురాచారబుద్ధియే మెండగును, స్వధర్మపరాయణురాలు, త్యాగశీలురాలు నగు స్త్రీకి అందఱును నమస్కరింతురు. ఆమె కేవస్తువునకు లోపము గన్పింపదు. దురాచారి యగువాఁ డీమె నీడనైన దాకజాలడు. అట్టి సతీమతల్లి కేదేని లోపము గలిగినచో ప్రభుత్వము ద్వారా భర్తృకుటుంబమునుండి దీర్చ వలయును. భర్తృకుటుంబమున ధనమేమియు లేనియెడల నామెకు తండ్రియో, సోదరుడో తప్పక దోడ్పడుదురు. వారి సాహాయ్యము సంతోషపూర్వకముగ లభించకున్నను శాసనముద్వారానైన ఆమెకు సహాయము కలిగించవలయును.

“బుద్ధిమంతుడైన మనుజు డెవ్వడును దుర్వినియోగము చేయవలసి వచ్చునేమో యను భయముచేతను, తనకే హాని కలుగునేమోయను భయము చేతను శస్త్రాస్త్రములను దనవద్ద