పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

హిందూకోడ్ బిల్ సమీక్ష

స్థితిలో నిరువురి కార్యములును ధ్వంసము అగును. అహంకారము, భేదభావము, కలహము మూలమున దాంపత్య జీవితమును, కుటుంబసుఖమును విషప్రాయమై పోవును. శ్వశురకులమునకు (మామగారి కుటుంబమునకు) రాణియు, గృహలక్ష్మియునగు స్త్రీ శ్వశురుల శుశ్రూషను, భర్తృసేవను, సవినయ వ్యవహారమును చేసిన నది దాసత్వమన బడదు. సాధారణముగా బురుషులు కూడ గురుజనుల (తల్లి, తండ్రి మొ|| వారు ) యెదుట దాసులగుటను తప్పుగా భావింపరు. వాస్తవమున నీదాసత్వమే సర్వాధికమైన యైశ్వర్యము నకు స్త్రీనిగాని, పురుషునిగాని ప్రభువుగా జేయును.

" తండ్రి యాస్తి మీద నాడుబిడ్డల కధికారముండుట వలన వారి భర్తలు దురాచారులయినను, పునర్వివాహము జేసుకొన్నను లేక మృతిచెందినను వారు తమ దుష్ట బంధు పులకు దాస్యము చేయుచు, అనాచారములద్వారా ధనోపార్జన జేసుకొనుచు జీవన యాపన జేయనక్కఱలేదు. బిడ్డలను నిశ్చింతగా పెంచుకొనవచ్చును. ఆర్థికశక్తి కలుగుట తోడనే స్త్రీ భర్తవలన , బంధుకోటివలన, కాముక జనము వలన రక్షణ బొందగలదు" ఇట్లు కోడుపక్షము వారందురు. కాని ఇదియు ననంగతమే. భర్తృ కుటుంబము యొక్క సంపత్తు మీదనే స్త్రీ కధికారము విధించబడినది. వివాహా సంతరము భార్య భర్తృ గోత్రమునకు జెందిన దగును. ' పిండం దత్వాధనం హరేత్ ' అను వాక్యమును బట్టి శ్రాద్ధ, తర్పణ, పిండదానాదులు చేయువాడే ధనమున కధి