పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

61

నిజమే. ధనము లేని వాడుకూడ భార్యనగలనమ్మి ఋణముల దీర్చివేసి సోదరికై మంచిగృహమును, మంచివరుని వెదకుచునే యున్నాడు. భారతదేశమం దందఱు జనులు కోటీశ్వరులు, లక్షాధికారులు కారను విషయము, చాలమంది బీదవాండ్రను విషయముకూడ నిజమే. తండ్రి మరణించినచో చాలమంది యాడుబిడ్డలకు పెండ్లికైన రూపాయలు మిగులుటలేదు. వారి గతి యేమి కావలసినది? అను విషయము కూడ నాలోచించదగినది. పైవిషయములతోబాటు క్రింది విషయములుకూడ నాలోచించవలసినవే. అవి యేవనగా, తండ్రి ఋణగ్రస్తుడైనచో నాడు బిడ్డకు లభించు సంపద్భాగముతో పాటు ఒకకొంత ఋణభాగముకూడ లభించునుగదా! వేయి, వేయి రూప్యముల భాగములను పొందిన కన్యకల నెంతమంది పెండ్లాడుటకు సంసిద్దులగుదురు మఱియు వేయి. వేయి రూప్యముల ఋణభారమును పొందిన కన్యకల నెంత మంది పెండ్లాడుటకు సంసిద్దులగుదురు? అను విషయము కూడ నాలోచించదగినదే. ఏకొలది రూపవతులగు స్త్రీలకో తప్ప మిగిలిన స్త్రీలందఱకు హిందూకోడు హాని కలిగించును. ఇది ధ్రువము.

స్త్రీ తన తండ్రివలనవచ్చిన ధనమును పొలమును పెట్టుకొని స్వతంత్ర వ్యాపార, వ్యవసాయములనారంభిం చినచో నామె కార్యమునకు బుత్రులుగాని,భర్తగాని తోడ్పడు టసంభవమయి పోవును. ఇట్లే పతి, పుత్రాదుల కార్యములందీమెయు తోడ్పడుట మానివేయును. ఈ