పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

హిందూకోడ్ బిల్ సమీక్ష

దింకను నధికముగ నబలలమీద నత్యాచారములు జరుగును. తండ్రి జీవించియుండగనే తన భాగమును తాను దీసుకొని వేఱయిన పుత్రునకు తండ్రి మరణానంతరము యాస్తిలో భాగము లభించవలెనని భావించిన మిగిలిన కుమారులయెడ జాల ఘోరతరమగు నన్యాయము జరిగినట్లే. కన్యాదాన ముత్తమోత్తమమైన దానము. వివాహమందు దానముతో బనిలేదని భావించుటకూడ జాల బొరబాటు. స్త్రీ పురుషు లిద్దఱు నొక్కఱే. ( భార్యాభర్తలు ఇరువురు నొక్కఱే ) వారిద్దఱకు స్వార్థ మొక్కటి. జీవన మొక్కటి. వారిద్దఱిలోను వేరువేఱు స్వార్థములను గల్పించుటనునది కలహమునకు విత్తువేయుటయే.

బిల్లు సమర్థకులు చెప్పునదేమనగా, "తండ్రి యాస్తి మీద నధికారము వచ్చుటతోడనే యాడుబిడ్డల నిమిత్తముగా నడచుచున్న కట్నముల యాచార మంతరించునట. దైన్యస్థితి యుండదట. తండ్రి ధనమం దధికారముండుట చేత నత్తవారింట దాసురాలై పడియుండ నక్కఱలేదట. ఇంతకు పూర్వము స్త్రీ ధన కుబేరులవంటి సోదరులుండియు డబ్బు కొఱకై యొరులమీద నాధారపడి యుండవలసి వచ్చుచున్నదట. ఆడుబిడ్డ భాగ మాడుబిడ్డకీయకుండ అన్యాయమునకు పాల్పడు సోదరునిమీద నామె కేసు పెట్టుకొనవచ్చునట.” ఆలోచించి చూడగా పైవిషయము లన్నియు గడు సత్య దూరములని సుస్పష్టమగుచున్నది. ధనికుడగు సోదరుడు తన సోదరి కష్టపడుచుండగా జూచి యూరుకొన లేడను విషయము