పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

59

దులుగూడ నందేజరుగును. వాస్తవమున భార్యాభర్తల యొక్క జీవన మొక్కటి కదా! కనుక కోడలు తనతండ్రి యింటనుండి యెంత యాస్తిని దెచ్చుకొనివచ్చునో , అంత యాస్తిని లేక అంతకంటే నెక్కువ యాస్తిని యాడపడుచు తన యత్తవారింటికి గొనిపోవును. లాభమేమియు లేకపోగా సోదర బావమరదులలో గలహములు బయల్వెడలును. కేసులు, దావాలు నధిక మగును, తక్కువ యాస్తి లభించినను తండ్రి యప్పులోని కొంతభాగము తనమీద బడినను ఆడుబిడ్డకు పెండ్లియగుట కష్టమయి పోవును.

ఇప్పటి సాధారణస్థితిలో తండ్రి లేక సోదరుడు తమ భార్యల మెడలలోని నగలనైన అమ్మి యప్పులు తీర్చి తమ యాడుబిడ్డకు (సోదరి గాని, కుమార్తెగాని) మంచి యింటిని, మంచి వరుని జూచి పెండ్లి చేయుచునేయున్నారు. తరచుగా తమకంటె నుచ్చస్థితియందున్న గృహమును వెదకి యచట తమ సోదరికి, కుమార్తెకు బెండ్లి చేయుచున్నారు. పితృ కుటుంబముకంటె నత్త వారి కుటుంబము అధిక స్థితిగలది యని అనుకొనదగు నుదాహరణము లెన్నియో కలవు. బిల్లు ప్యానయిన తరువాతనూ ఆడుబిడ్డలు స్వయంవరము జేసుకొన వలసివచ్చును. వివాహము దూరదృష్టితో కూడినది కాక కామమే కారణముగ గలదియగును. ఆస్తులయందలి యాశ కొలది నాడువారిమీద నె న్నేని యత్యాచారములు జరుగ గలవు. నేడు సంపత్తు లేకుండగనే గూండాలు అబలలను బాడుచేయుచున్నారు. సంపత్తునందలి లోభముచేత నికముం