పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

హిందూకోడ్ బిల్ సమీక్ష

చున్నది. దానికి బదులుగ వేఱొక నవీన వ్యవస్థను జేయవలసిన యక్కఱలేదు. ఒకడు ఒకని ఇంటిని కూలగొట్ట నారంభించగా మనముకూడ వెళ్లి యా గృహమును వేఱక విధముగ గూలద్రోయ బూనుట ఉచితమును కాదు. అవసరమును లేదు."

ఈ కోడుబిల్లు మూలమున పారంపర్యముగ వచ్చుచున్న యనేక హిందువుల విశేష విషయములు అంతరించును. దీనిద్వారా హిందువులు మహమ్మదీయులుగను, క్రైస్తవులుగను బోతపోయబడుదురు. వివాహ ప్రకరణము లో ప్రతి హిందువును బెండ్లి చేసుకొన నవకాశమీయబడినది. ఈ కారణముచేత వర్ణవ్యవస్థ యంతయు చెడి వర్ణసాంకర్య మేర్పడును.ప్రాచీన వ్యవస్థనుబట్టి కౌటుంబిక జీవనము, సంపత్తు స్థిరముగ నుండెడివి. ఈ కోడుబిల్లునుబట్టి ఆడుబిడ్డలను భాగస్థులగను వారసులనుగను చేయుటమూలమున సంపత్తంతయు ఛిన్న భిన్నమై పోవును. 10 ఏండ్ల లోపుననే సాధారణకుటుంబీకుల యిండ్లు, పొలములు నమ్ముడైపోవును. ఆడుబిడ్డ యత్తవారింటికి బోవుచు దనభాగమునకు వచ్చిన యింటిని, పొలమును అమ్ముకొనిపోవగలదు. ఆమె యెక్కువ ధనమునకు లోభపడి అన్యమతస్థులకు కూడ అమ్మివేయగలదు. ఒకే యింటియందును, యింటింటను, భర్తయొక్కయు, సోదరుని యొక్కయు నింటిలోను హిందుస్తానము, పాకిస్తానము నేర్పడును. సోదర గృహమందును, భర్తృగృహమందును కురాను చదువ బడును, గోమాంసము వండబడును. వేదపాఠహోమా