పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

57

నుపాధ్యాయుడు గూడ స్వతంత్రులు కాగోరుట లేదు. వారి యనుసంధానమంతయు నితరుల యాజ్ఞలమీద నడచుచున్నది. వారు స్వతంత్ర సంకల్పములు కలిగి యుండ లేకున్నారు. భాగవతమందలి చండామార్కులువంటి పరాధీనోపాధ్యాయులు 'స దీనో రాజసేవకః' అనియే భావింపబడుదురు. ఈ దృష్టి చేత శిక్షణపద్ధతిని, భూములను, ధార్మిక సామాజిక నియమములను ప్రభుత్వము వారి చేతులలో బడనీయకుండుటెంతయు నవసరము. హిందూకోడు ఈ మూడింటిని తప్పక నాశమొందించును. ఫలరూపముగ కమ్యూనిజము బాగుగ ప్రబలిపోవును.

కొందఱు జనులిట్టులనుచున్నారు."తాము హిందూకోడు యెడ ద్వేషమునే చూపుచున్నారు. కాని మీ హితమును మీరేమియు జూచుకొనుటలేదు. ప్రస్తుత హిందూకోడు మీ కిష్టము కానిచో మీకు ఏ కోడుబిల్లు ఇష్టమగుమో మీరే చెప్పండి! నేడు ఏదియో యొక క్రొత్తవ్యవస్థ చేయనిదే కార్యక్రమము జరుగజాలదు గదా! కనుక మీకిష్టమైన కోడును జెప్పి మీపక్షమునే నిలువ బెట్టుకొనండి! ఉచితమని తోచిన ప్రజాప్రభుత్వము దానిని గుఱించియే విచారణ జేయగలదు." దీని నాధారముగ జేసుకొనియే కొందఱు స్త్రీలు, పురుషులు క్రొత్త కోడుబిల్లు నిర్మాణము. నకు సంసిద్ధులు కాజొచ్చినారు, కాని యీ విషయమున మేము ఇంతమాత్రమే సమాధాన మిచ్చెదము.. ఏమని యనగా, "ఇప్పటివరకు నొక సాంగో పాంగ వ్యవస్థ నడచుచు వచ్చు