పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

హిందూకోడ్ బిల్ సమీక్ష

వచ్చినది. ఈతప్పుడు ఇతిహాసము నశించనంతవఱకు, సముచితమగు నితిహాసము నాచరణలో బెట్టనంతవఱుకు నింకను నెన్ని యనర్ధములు జరుగునో చెప్పజాలము.

ఇదే విధముగ ధార్మికవిషయములలోను, సామాజిక విషయములలోను ప్రభుత్వము జోక్యము కలుగజేసుకొన నిచ్చినపుడా ప్రభుత్వ మేదేని నాస్తిక పథము ననుసరించుచు ధర్మమును ద్వేషించునది యైనచో సర్వవిధములచేతనుగూడ ధార్మిక, సామాజిక నియమముల సమూల నాశనము చేయును. ఔరంగజేబువంటి శాసకులే నియమములనుజేయ నారంభించినచో నేడెచ్చటను నామమాత్రమునకైన దేవాలయములు లేకుండ బోయెడివి. శిఖా యజ్ఞోపవీతములు కూడ నుండెడివి కావు. ఈ కారణముచేతనే మహర్షులు శిక్షావిధానమును సామాజిక, ధార్మిక నియమములను ప్రభుత్వము చేతులలో బెట్టలేదు. కనుక శాసనము మారినను శిక్షా పద్ధతి మాత్రము మార్పుచెందదు, ధార్మిక, సామాజిక నియమములు మార్పు జెందవు. తన్మూలమున రాష్ట్రము తన బుద్ధిచేత దానాలోచించుకొని తన ధర్మ, కర్మాదులను రక్షించుకొన గలుగును. ఏ రాష్ట్రమయినను భౌతిక పారతంత్య్రమును భరించగలదు. కాని యాధ్యాత్మిక, మానసిక పారతంత్య్రమును మాత్రము భరింపజాలదు. ఒక వ్యక్తికి బేడీలు వేయుటచేతను గూడ మస్తిష్కమును పాడు చేయుటవలన గలుగు కష్టము కలుగదు. క్లోరోఫారమును వాసన చూపి వ్యక్తిని స్మృతిహీనునిగా చేయుట చాల హానికరము, ప రముఖాపేక్ష గల శిష్యుడు,