పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

55

కూడ పాడుచేయబడినవి. ఆర్యులు ఉత్తరధ్రువమునుండి కాని పశ్చిమోత్తర ఆసియానుండి గాని వచ్చియున్నారని నిరూపించుటకు వీరు ప్రయత్నించియున్నారు. వేదములు గొల్లల గీతములనియు, రామాయణ, భారతాదులకు బ్రమాణ మెద్దియా లేదనియు నిరూపింప బ్రయత్నించినారు, ఇందు మూలముననే ఆర్యులు తమయింట గూర్చొనియుండియు విదేశీయులై పోయినారు. వీరు తమను, తమ పూర్వీకులను హీనులని భావింపదొడంగిరి. తమ సంస్కృతి, సభ్యతలను గూడ హీనముగ భావించి, యత్యంతము గ్రుడ్డితనముతో నితరుల ననుకరింప మొదలిడిరి. ఈ కారణముచేతనే దేశమం తయు ఖండఖండములు కావలసి వచ్చినది. భారతదేశ మేదియో పంచాయతీస్థానమనియు, ఇది వారి వంశపారంపర్యముగ వచ్చుచున్న ధనము కాదనియు, ఇందు బయటనుండి మహమ్మదీయు లెట్లు వచ్చియున్నారో, అట్లే యార్యులును వచ్చియున్నారనియు నేవేవో భావము లిచ్చటి ప్రజల మెద డులలో గడ్డకట్టుకొనిపోయినవి. పైగా నీదేశము ఎట్లుగ మనదో, అట్లే వారిదికూడ నట, 'వీరికి, వారికి పడనప్పుడును, వీరు, వారు కలసిమెలసి యుండుటసంభవ మయినపుడును దేశమును ఖండములుగ జేసుకొని యెవరి భాగమును వారేల దీసుకొనగూడదు ?' అను నిటువంటి దురాలోచనలకు ఫల రూపముగ దేశము విభజింపబడి పాకిస్తాను ఏర్పడినది. లక్షలాది స్త్రీ పురషాదులు చంపబడినారు. లక్షలాది జనులు ఇల్లు, వాకిలి లేక శరణము! శరణమంటూ తిరుగవలసి