పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

హిందూకోడ్ బిల్ సమీక్ష

త్వము నణగద్రొక్క గలుగుదురు. కాంగ్రెసు కార్యక్రమము లందుగూడ కోట్లకొలది రూపాయలు ఖర్చయిపోయినవి. కనుకనే మజ్దూరు గవర్నమెంటు కంజర్వేటివు దళమును తొలగించ గలిగినది. ప్రజల వద్ద నేసంపదయు లేని పరిస్థితిలో ప్రభుత్వ మేమి చేసినను న్యాయమును, అన్యాయమునుగూడ ప్రజలు తలయొగ్గి అనుభవించవలసినదే. కాని వేఱుదిక్కు లేదు. ఇట్లు రాజనీతినిబట్టి యాలోచించినప్పటికీ రాష్ట్రము కుంటిదై పోవును. కనుక ప్రభుత్వము సాధ్యమయినంతవరకు రాష్ట్రమందలి వ్యక్తిగత జీవనములందు, సామాజిక, ధార్మిక జీవన ములందు చాల తక్కువ జోక్యము కల్గించుకొన వల యును. రాష్ట్రము యొక్క భూమినంతను ప్రభుత్వము చేత బెట్టుటనునది తమ కాలుసేతుల ఖండింపజేసుకొనుటతో సమానము.

ఇట్లే శిక్షా విధానమును (విద్యను) గూడ ప్రభుత్వము చేతులలో బెట్టకూడదు. శాసకు లొకప్పుడు, ఆస్తికులు, వేఱొకప్పుడు నాస్తికులు నగుచుందురు. వారు వేర్వేరు విధ ములతో శాసనక్రమములను నడపవచ్చును. దాని కనుకూల ముగ రాష్ట్రనిర్మాణము నపేక్షింతురు. ఆ రాష్ట్రనిర్మాణమున కనువగు శిక్షాపద్ధతి నమలు జరప జూడవచ్చును. తన్మూల ముగ రాష్ట్రమందలి సంస్కృతి, సభ్యత, గౌరవము పూర్తిగ నడుగంటిపోవును. భారతదేశములో నేటివరకు నడచుచున్న శిక్షావిధానమునకు కారకులు ఆంగ్లేయులు. ఈ యాంగ్లేయ శిక్షావిధానమందు భారతదేశముయొక్క చరిత్ర, సాహిత్యము