పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

53

వల్క్యాదుల విధానములు వ్యర్థములు. ననవసరములు నయి పోవును. ఇక ధర్మనాశము తప్పదు గదా! అన్న చెల్లెండ్ర పంపకముల మూలమున సంపత్తు అనేక బాగములుగ విభజించ బడి ఛిన్నభిన్న మయి పోవును, అంతమునకు యావత్తు భూమిని సంపదను, రాష్ట్రీకరణము చేయగా (రాష్ట్రమునకు చెందునట్లు చేయబడగా) ఎవ్వనివద్దను ఎట్లుగ వ్యక్తిగత సంపత్తు ఉండదో అట్లే, ఈ విషయమునగూడ జరుగును. ఇట్లు సంపత్తు నశించుట నిశ్చితము. ఈ స్థితిలో తిండి, గుడ్డ, వైద్యము, న్యాయము చౌకగా లభించుట కెంతకష్టము కలుగునో వేఱుగ జెప్ప నక్కఱ లేదు. ఎప్పటికయిన ధర్మమువలననే సమాజముకాని రాష్ట్రముకాని నిలువ గలదు.

ఎపుడయితే వ్యక్తిగతభూములు, సంపత్తులు నశించి పోవునూ లేక రాష్ట్రములో కలుపుకొనబడునో , అపుడు జీవనము కేవలము జడయంత్రమువలె నుత్సాహవిహీనమై పోవును. విశేషధనముకొఱకును, విశ్రాంతి కొఱకును విశేష కార్యములు సంపాదించుకొనబడును. ఇంతియగాక యజ్ఞ తపో దానాదులు కట్టువడిపోవును. పిమ్మట నొకవేళ నీ చంచలురాలగు రాజ్యలక్ష్మి యేవిదేశ శాసనమునకైన ఏ అయోగ్య స్వతంత్ర ప్రభుత్వమునకైన లోబడిపోయినచో, దానిని మున్ముందు విడిపించుట ఆవశ్యక మగును. తన్నిమిత్తముగ నాందోళనా ప్రయత్నములు సలుపు టవసరమగును. తన్నిమిత్తముగ జాలడబ్బు ఖర్చు అగును. వ్యక్తిగత భూమియు, వ్యక్తిగత సంపదయు నున్ననాడే ప్రజలు అయోగ్య ప్రభు