పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

47

త్రాగుటకు దగుసౌకర్యముల గలుగజేయుటయు నెంత క్షమించవీలులేని యపరాధమో. అంతయే క్షమింపవీలులేని యపరాధము. ఈబిల్లు 'హిందూధర్మ శాస్త్ర సంగ్రహము ' అను నామమునకును, ఇందు హిందూ శాస్త్రము లందలి వేర్వేరుశాఖలు సంకలన మొనర్పబడునను ప్రతిజ్ఞకు బూర్తిగా విరుద్దము. ఇందు విభిన్న శాఖలు సంకలన మొనర్పబడుటకు బదులుగ నధార్మిక విషయములు సంకలన మొనర్ప బడినవి. కావున నీవ్యవస్థకు 'అధర్మసంగ్రహము' అని పేరు పెట్టిన జాల బాగుండును.


మఱియొక విషయము – కోడు సమర్థకులు ఒకచోట “విహాహము, దాయభాగము మొదలగు వానికి ధర్మముతోడ నేలాటి సంబంధమును లేదు. ఇది సామాజిక విషయము, అర్థమునకు జెందిన సమస్య - ఇది మంత్రులు విచారణ చేయ దగు విషయము. ఈ బిల్లు మూలమున హిందూధర్మమున కేమియు హాని కలుగదు. కనుక ధర్మవిషయమున జోక్యము కలుగజేసుకొను చున్నారను విషయమే లేదు.” అని చెప్పు చున్నారు. ఆ సమర్థకులే “ఈ బిల్లు పేరు 'హిందూధర్మ శాస్త్రసంగ్రహ' మరియు ఇందు హిందూధర్మశాస్త్రము యొక్క వేర్వేరు శాఖలు క్రోడీకరింపబడిన వనియు, ధర్మములోని పురాతన నిగూఢసమస్యలను సరళాతిసరళముగ జేయుచున్నా మనియు" బలుకుచున్నారంటే అర్ధమేమయిన ఉన్నదా? దీనిని బట్టి యేవో ధర్మశాస్త్రము