పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

హిందూకోడ్ బిల్ సమీక్ష

లనుచు హిందువులను మోసములో బడవేయు చున్నారని” సుస్పష్ట మగుచున్నది.

'భారత దేశమందు నూటికి తొంబదిజనులలో విడాకులచట్ట మమలులో నున్నది' అని కోడుబిల్లు వారి వాదము. కాని వారివిషయమున పంచాయతీలవారే బహిష్కార ప్రయత్నములను జేయుచుండగా కచ్చేరీలకు బోవవలయు నాడంబరమంతయు నెందులకు దెచ్చి పెట్టుచున్నారు? ప్రజల సమయమును, ధనమును కోర్టుల వ్యవహారములలో ఖర్చు చేయించుట "అవ్యాపారేషు వ్యాపారః” అనబడదా? జిల్లాజడ్జి గారు వివాహ విచ్ఛేదము ఘోషణ చేసి నప్పటికి దానిని దృఢపరచుటకునై కోర్టులకు దప్పనిసరిగా బోవదగు వ్యవస్థ చేయుచున్నారు. కోడుబిల్లు 1వ భాగము 44వ ధార (రూలు) 1వ నియమమందు 'జిల్లా జడ్జిగారు ఇచ్చిన వివాహవిఛ్ఛేద సంబంధమగు ప్రతిడిక్రీ ని హైకోర్టు ద్వారా దృఢపరచుకొన వలయును' అని స్పష్టముగ వ్రాయ బడియున్నది. ఆ విషయము నెక్కువగా బరిశీలన జేయనెంచినను లేక అన్యసాక్ష్యమేదేని తీసుకొననెంచినను హైకోర్టు ఆ చేయదగు కార్యక్రమమును దెలియజేయునట. ఆశ్చర్యకరమగు విషయమేమి యనగా, భార్యవద్ద కేసును నడపు కొనుటకు దగుధనము లేకపోయినచో కోర్టు ఆమె జీవనోపాధికై నెలకింతయని యొక కొంతధనమును, కేసులకయిన ఖర్చులను గూడ నామె భర్త చేత నిప్పించునట. ఈవిధముగ నీ బిల్లు భర్త యొక్క ద్రవ్యముతోడనే భర్తతోడ కేసును