పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

హిందూకోడ్ బిల్ సమీక్ష

వారియెడను సమానముగ జెల్లనేరదు. అందఱు రోగులందఱకు నొకేమందుకాక దేశకాల రోగప్రకృతులనుబట్టి వేఱువేఱు మందు లీయబడుచున్నటులే మనవేదములు, మహర్షులు నందఱకు ననువైన వేరువేరు విధానముల నేర్పరచి యున్నారు. బ్రాహ్మణుకు రాజసూయమును జేయ వీలు లేదు. క్షత్రియుడు వాజపేయము నాచరింపరాదు. క్షత్రియాదులు వైశ్యస్తోమము నాచరింపకూడదు. ఇట్టిస్థితిలో నందఱి యెడను ఒక్క విధానమెట్లు చెల్లును ? జనులెంత యధికముగ నబద్ధమాడుట కలవాటు పడినను, అబద్ధ మెంత యధిక ప్రచారములోనికి వచ్చినను 'అబద్ధమాడవచ్చును' అను విధానముమాత్ర మేర్పడజాలదు. అబద్ధమాడెడు ప్రవృత్తి యెంత యధికమైనను మహత్త్వము సదా సత్యమందే యుండును. ఇట్లే శాస్త్రవిరుద్ధమగు ఆచరణము చేయవలెననియు, ఇష్టమువచ్చిన రీతిని సంయమము లేకుండ భోజనము చేయ వలయుననియు, ఇష్టమువచ్చినరీతిని బెండ్లి చేసుకొనవలయు ననియు ప్రవృత్తి యెంత యధిక మయినను దాని కనువగు బిల్లు మాత్ర మెన్నడు ప్యాసు కాకూడదు. అట్లు దుష్ప్రవృత్తుల కలవాటుపడిన వ్యక్తులను సదాచారులతోడ సమానముగ జూచుటయు, వారి యాప్రవృత్తుల కవకాశములను గల్పించుటయు ననునది పాపాచరణమునకును, స్వేచ్ఛాచరణమునకును, దోహదమిచ్చుటయే. శాస్త్రవిరుద్ధ జీవన ములు గడపుటకు సౌకర్యములను గల్పించుటనునది, అన్న చెల్లెండ్ర పెండ్లిండ్ల కవకాశము కల్పించుటయు, సారా