పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

45

లందురు. ఇది కూడ నేమియు బాగులేదు. పాశ్చాత్యశిక్షణ. సభ్యతల కలవాటువడి, యిష్టము వచ్చినట్లుగ నడచుకొనుచు నుండు యేకొలది చపలచిత్తులతో తమలోగల విషయలోలు పత్వకారణముగను, ఇంద్రియదాస్య కారణముగను హిందూ శాస్త్రములను మార్పు చేయవలయునను బుద్ది పుట్టును, కాని జితేంద్రియులు,దూరమాలోచించగలవారునగు స్త్రీ పురుషులు మాత్రము తపోధనులగు మహర్షుల యుపదేశములను, వేదాది సమ్మతవిధానములనే పరమకల్యాణకారణములుగా భావింతురు. ఈబిల్లు హిందూధర్మశాస్త్రముల యొక్క సంగ్రహమని చెప్పుచున్నారు గదా! అట్టిస్థితిలో నిందు నవీనవిషయ ముల జేర్చుట యేమి సమంజసముగ నున్నది? విశేషముగ అంతర్జాతీయవివాహము, సగోత్రవివాహము. విడాకులచట్టము ఆడుబిడ్డకు దాయభాగము మొదలైనవన్నియు ధర్మశాస్త్రము. నకు విరుద్ధమైనవే కదా? ఇందు ఈ విరుద్ధ విషయములన్నియు నేల చేర్చబడినవి? ఏ ధర్మశాస్త్రము చేతనైనా యీవిషయములను సమర్ధించవచ్చు నందురా! దాని నేల యెదుట బెట్టుట లేదు !

వాస్తవమం దీబిల్లు వారు మితాక్షరాపద్ధతిని గాని దాయభాగవిషయమునుగాని, వీరమిత్రోదయ విషయమును గాని దేనినిగూడ స్వీకరించలేదు. ఒకచోట నొక కొంత మఱియొకచోట మఱియొకకొంత, వేఱొకచోట వేఱొక కొంతను ప్రోగుచేసి యీబిల్లును భానుమతి సంసారమును కూడ బెట్టినట్లు కూడబెట్టినారు. ఈ విధాన మన్ని వర్గముల