పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

హిందూకోడ్ బిల్ సమీక్ష

వారికి వేదముల మీదను, వైదిక తపోధనులు, వీతరాగులు నగు మహర్షుల యొక్క ధర్మశాస్త్రముల మీదను దాడి చేయుట కెట్టి యధికారమును లేదు.

పైగా సర్వవిధముల చేతను శాస్త్ర విరుద్ధమై ధర్మ మును సర్వవాశన మొనర్పనున్న యీ హిందూకోడుబిల్లు నకు 'హిందూధర్మశాస్త్ర సంగ్రహము అను పేరు కూడ పెట్టినారంటే అది యెంతయు ధూర్తత్వము, మూర్ఖత్వము నన్నమాట. "విభిన్న ధర్మశాస్త్ర విషయములతోడ నల రారునట్టిదియు, హిందూసమాజమందలి యన్ని వర్గముల వారుకూడ పాటించుటకు దగినదియు నగు మెక క్రమబద్ధ మైన ధర్మశాస్త్రనంగ్రహమును నిర్మింపవలయునని ప్రజల కోఱిక నానాటికి బలీయమగు చున్నదని" బిల్లుసమర్థకులు చెప్పుచున్నారు. కాని యిది చాల యసంగతవిషయము. హిందూ ప్రజ లెప్పుడు నిట్టిబిల్లులను కోరుకొనలేదు. పైగా హిందూకోడు నొకభయంకర విపత్తుగా భావించి దానియెడ చాలఘోర ద్వేషమును జూపుచున్నారు. హిందూలా కమిటీ వారి రిపోర్టుమూలమునను, డాక్టరు మిశ్రగారి రిపోర్టుమూల మునను ప్రజల ద్వేషభావము సుస్ప ష్టమగుచునే యున్నది.

"హిందూ సమాజమందలి వర్తమాన పరిస్థితులను గమనించుచున్న ప్రతి బుద్ధిమంతుడును 'హిందూధర్మమందు అవశ్యముగ పరివర్తనము జరుగవలసి యున్నది. అనువిషయమును తప్పక అంగీకరించుచున్న వాడే” అని కోడుసమర్థకు