పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

43

రక్త మపరిశుద్ధమైన లేక జెడిపోయిన దానిని దీసివేయించు కొనుటకుగూడ నాతడు వెనుకడుగు వేయడు. ఏదేని యవయవము క్రుళ్ళిన లేక చికిత్సచేయ వీలులేనియెడల నతడా (ఆస్తికుడు) యవయవమును ఖండించి వేయించుకొనుటకు శంకింపడు. అవతారస్వరూపులు, మహర్షులు కూడ మార్పు చేయ వీలులేని ధర్మమును మార్పు ఎవ్వడు చేయును' అనునదే సమస్య. శత్రువు మన దోషరహితములగు శిరోహస్తాదులను దోష భూయిష్టములని చెప్పి ఖండింప నెంచినచో, మనము సహింతుమా? మన పవిత్ర రక్తమును దీసివేయించ బూనుకొనిన వాడు శ్రేయస్సును గోరువాఁ డెటులగును? ఆతఁడహితమును గోరువాడే. శత్రువే. అట్టి వానితోడ నొడంబడిక లేమిటికి? అనాది సిద్ధములు, నపౌరుషేయములు, పరమకల్యాణ కారణములు, శాస్త్ర సమ్మతములు, వేదానురూపములునగు వ్యవస్థ లకు వ్యతిరిక్తముగ జరుగుచున్న కార్యక్రమము గుఱించి యొడంబడిక లెట్లు పొసగును? ప్రస్తుత హిందూకోడుబిల్లును ఆంగ్లేయ శాసనకాలముందు 'సర్ సుల్తాను అహమదు' అను మహమ్మదీయుడు స్థాపించియుండెను. యోగేంద్ర మండలుడను హరిజనుడు సమర్థించియుండెను. దానినే నేడు డాక్టరు అంబేడ్కరుఅను హరిజనమహాశయుడు ఎటులైన ప్యాసు చేయించ జూచుచున్నాడు. అంబేడ్కరుగారికి స్వయముగా హిందూధర్మ మనిన గిట్టదు. ఆయన మనుస్మృతిని నిండుసభలో దగుల పెట్టిన ఘనుడు. ధర్మ విరుద్ధముగ బ్రాహ్మణ స్త్రీని బెండ్లాడిన యసహాయశూరుడు. వాస్తవమున నిట్టి