పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

హిందూకోడ్ బిల్ సమీక్ష

గ్రామ గ్రామమందు , ప్రతియగ్రహారమందు భారత రామాయణ కథలు జరుగవలయును. సత్సంగము జరుగ వలయును. ధర్మ, విశ్వాసములు నాధారముగ జేసుకొని గ్రామ పంచాయతీలు నెలకొల్పబడ వలయును. అవి గ్రామ మందలి ప్రతి కుటుంబమును దృష్టియం దుంచుకొనవలయును. అత్యాచారముల నిరోధింపవలయును. అత్యాచారమొనర్చు వానిని దండింప వలయును. ఆ దండనకూడ సామాజికము కావలయును. అప్పుడీ కుటుంబసమస్యలు పరిష్కారము కాగలవు. హిందూకోడు ఈరోగములనునివారించుటకు బదులుగ నాటిని మఱింత పెచ్చరిల్ల జేయును.

కొందఱు హిందూకోడు సమర్థకులతోడ నొడంబడికలకు బ్రయత్నించు చున్నారు. 'కొంత మేము ముందడుగును కొంత వారు వెనుకడుగును వేసినప్పుడు ఐకమత్యము కుదురును. హిందూకోడును కొంతవఱకు సవరించి గ్రహించ వచ్చును.' అని వీరి తలంపు. వీరి స్థితియు చాలా విచిత్రముగ నున్నది. వీరు ఆస్తికులును కారు. బాగు గోరువారును కారు. కేవలము కీర్తి నార్జించుటకును, నలుగుఱిలోను దమపేరుండు నట్లు చేసుకొనుటకును వీరు యత్నించుచున్నారు. వీరి పలుకు లాస్తికులకు నచ్చవు. దేశహితంకరులకు నచ్చవు, కేవల కలహములను దీసుకొని వచ్చుటకునై యిట్టి జయచందులు కార్యరంగము లోనికి గొని తేబడుచున్నారు. వాస్తవమున సనాతనమార్గమున బడిపోవు ఆస్తిక సోదరునికంటె మించిన శ్రేయఃకాముడు వేరొకడుండునా? ఉన్నాడా? శరీరమందలి

.