పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

41

వారు పూర్తిగా ధర్మమును, శాస్త్రమర్యాదలను ఉల్లంఘించు చున్నారన్నమాట. కాని వారికి తమ యధికారవాంఛలను, వ్యసనములను, తత్ప్రేరితములగు దుష్కృ త్యములను ఒరుల నెత్తిని రుద్దుట కెట్టి యధికారమును లేదు. పురుషులు ననధికార ప్రయత్నములనుండి మఱలించుటయు, శాస్త్రముల ననుసరించియే స్త్రీలకు సర్వవిధసౌకర్యములు నేర్పరచుటయు శాసనము యొక్క ముఖ్యకర్తవ్యము. ఏయే లోటులను పూర్తిసేయుటకు, నేయే సౌకర్యములను సంపాదించుటకు హిందూకోడు అవసరమని తోచుచున్నదో, ఆయా విషయములను శాస్త్రానుకూల మార్గములను బట్టియే సాధించవచ్చును. 'ఈబిల్లుమూలముగ వ్యభిచారము, అనాచారములు వర్ణసాంకర్యము, కలహములు పెచ్చు పెరిగిపోవు' నను విషయమును హిందూకోడు సమర్థకులు కూడ యంగీకరించుచునే యున్నారు, కాని హిందూకోడుకు పూర్వమందు మాత్ర మీ విషయము లన్నియు లేవా? అని వారు వాదింతురు. ఈ విషయము అసత్యదురాచరణములను విడనాడవలసినదని శాసనము జేయుచు నా యసత్య దురాచరణము లంతకు బూర్వము మాత్రము లేవా? అని చెప్పునట్లున్నది.

వాస్తవమున యోగ్యమగు సమాజ నిర్మాణము చేయు టవసరము. కాని యది శాసనమువలన బొసగదు. శిక్షణ వలన బొనగును. ప్రస్తుతము జరుగుచున్న మలినోపన్యాన ములను, నాటకములను అరికట్టవలయును, సినిమాలను నిరో ధింపవలయును. దుష్ప్రకటనలు జరుగనీయ కూడదు.