పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

హిందూకోడ్ బిల్ సమీక్ష

హిందూకోడువంటి వస్తువును దయారు చేయుటకు ధారాసభ కెట్టి యధికారమును లేదు' అని స్పష్టీకరించినారు.

లోకతంత్ర దృష్టిచే కొలది జనుల యాలోచనలను బహుసంఖ్యక జనుల నెత్తిన బడవేయు టెంతయు నసమంజసము. దేశములో నూటికి తొమ్మండుగురు హిందువులు వోటు చేయగా ధారాసభ యేర్పడినది. దేశీయ రాజ్యము లందలి ప్రజలచే నెన్నుకొనబడిన ప్రతినిధి యొక్కడును ఇందులేడు. అట్టియెడ నీ ధారాసభచే నిర్మింపబడిన బిల్లు హిందూదేశమం దంతటను ఎట్లు చెల్లును లోకమత సంగ్రహణముచేయు కమిటీవారు కూడ "జనులు హిందూకోడుకు వ్యతిరిక్తముగ నున్నారు' అని స్పష్టీకరించియే యున్నారు కదా! అట్టి స్థితిలో పట్టిన పట్టును విడువనని కూర్చొనుట ఈ ధారానభ కేమి సముచితముగా నున్నది?

కొంతమంది జనులిటు లందురు "నేడు స్త్రీలయె డ జాల యన్యాయము జరుగుచున్నది. విధవా స్త్రీల దుర్గతి చెప్పనలవి కాకయున్నది. దత్తుని తల్లి యనుభవించుపాట్ల కంతము లేకున్నయది. భర్తలుకల స్త్రీలు కూడ తను భర్తల వలన నెన్నియో పాట్లకు లోనగుచున్నారు. లక్షలాదిరూపా యలను గడించి మరణించినవాని భార్యకు ధర్మనిమిత్తము గను, తీర్థయాత్రల నిమిత్తముగను కావలయు ధనముమాట యెటులున్నను, సముచితమగు భోజనము బట్టకూడ లభిం చుటలేదు. ఒక్కొక్క స్త్రీ సంవత్సరమున కొక్క పంచి