పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

37

హిందూకోడును ప్రజలు కోరుతున్నారని చెప్పబడు చున్నది. కాని యది వాస్తవము కాదు. దాని నెవ్వరును గోరుటయు లేదు. 'హిందూలా' కమిటీవారు దేశమందలి యన్ని ప్రాంతములందు బర్యటన చేసి యనేక సంస్థలను, ఆచార్యులను, విద్వాంసులను జడ్జీలను సాక్షులుగా బెట్టుకొని చాలమంది జనులీబిల్లు నామోదించనివారు ఉన్నారు' అని స్పష్టీకరించినారు. పట్నా హైకోర్టుజడ్జిగారు శ్రీద్వారకానాధ మిశ్ర గారు 'ఈ బిల్లును కోరువారును లేరు. దీని యవసరమును లేద'ని నొక్కి వక్కాణించియున్నారు.

వర్తమాన ధారాసభకు హిందూకోడువంటి బిల్లుల దయారుచేయునధికారము కలదనియు, విధానముల (రూల్స్ . నియమములు) వంటి మహత్త్వపూర్ణ వస్తువులను దయారు చేయు నధికారముండగా నాసభ హిందూకోడువంటి యుపయోగకారి యగు వస్తువు నేల నిర్మించకూడదు?' అని చెప్ప బడుచున్నది. కాని యీ చెప్పుటెంతయు నసమంజసముగ నున్నది. విధాన నిర్మాణార్థమై యీసభ యేర్పరుపబడినది.. అది విధాననిర్మాణము సేయవచ్చును. కాని హిందూకోడు ద్వారా ధార్మిక విప్లవమును జెలరేగజేసి ధర్మము విషయ ములో జోక్యము కలుగజేసికొనుట కెట్టి యధి కారమును లేదు. డాక్టరు కైలాసనాధకాటజూ,శ్రీకన్హయ్యాలాల్ మాణికలాల్ ముంశీ, శ్రీ పట్టాభిసీతారామయ్య, శ్రీ అనంతశయనం అయ్యంగారు, డాక్టరు రాజేంద్రప్రసాదు వంటి విద్వాంసులు