పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

39

తోడను 10 లేక 20 రూపాయలతోడను కాలము గడపు కొనుచున్నది. పురుషులు వారియెడ నిష్టము వచ్చినటుల బ్రవర్తించు చున్నారు,” పైవిషయము లన్నియు నాపాత రమణీయముగనే యున్నవి. కాని అన్ని సమాజములందు స్త్రీ పురుషులలో మంచివారు, చెడ్డవారు నిరుతెగలవారు నుందురు. పురుషులలో మంచివారును ఉన్నారు. స్త్రీలలో చెడ్డవారు నున్నారు. దోష మొకేషక్షమున లేదు. దోష మెవరు చేసినను క్షమింప వీలు లేదు. వాటిని పోగొట్టుటకు బ్రయత్నింపవలసినదే. కాని దానికి ఉపాయము హిందూ కోడు బిల్లు మాత్రము కాదు. సామాజిక శాసనమువలననే యాదోషములను దూరము చేయవచ్చును. హిందూకోడు సదా ఆఫీసులలోనే ఉండునది. మానవుడు కోర్టులలో ప్రవేశించనంత వరకు అది యేమియు చేయజాలదు. మామూలుగా నిటువంటి శాసనములు కొన్ని నేడును గలవు! విధవా స్త్రీకి భర్తయాస్తి వనుభవించుటకు సంపూర్ణాధికారముండనే యున్నది. పతివ్రతయగు విధవా స్త్రీకి తన భర్త సంపత్తు ననుభవించుటకు పూర్తిగ నధికారమున్నది. పతి యేదేని యన్యాయ మొనర్చిన నేడును దండితుడు కాగలడు. తద్వారా భార్యకు పూర్తిగ భరణపోషణములు ప్రాప్తించగలవు, కాని ఇటు పైన ఆమె కోర్టునకు బోవనియెడల న్యాయమును బొంద లేదు. హిందూకోడు ప్యాసయిన మీదటను ఆమెకు న్యాయమ లభించదు.. నేడో కోర్టుకు బోయిన న్యాయము లభించుచునే యున్నది. శాస్త్రానుకూలములగు నేకార్యములందు ప్రవర్తిం