పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

35

లేకుండ నందఱలోను వివాహ ఆహార సంబంధ మేర్పడవలయు మనియు గొందఱితలంపు. మఱియు నివ్విషయమున హిందూ కోడు బిల్లు మహెూపకారము చేయున్నదని తలచి వారు దానికెక్కువ దోహద మిచ్చుచున్నారు . కాని సిద్ధాంతమేమి యనగా ఈ ప్రపంచకమే త్రిగుణాత్మకము. గుణముల వైషమ్య మూలము: సృష్టియు, సమత్వమూలమున ప్రలయమును జరుగు చుండును. కనుక నెన్నిచోట్లనో వైలక్షణ్యమునకు ప్రమాణములు కన్పడుచున్నవి. వైలక్షణ్యము కన్పడని చోట్ల 'విశేషము' అనుపేరుగల పదార్థముద్వారా వైలక్షణ్యము గోచరించుచున్నది. గుఱ్ఱము, గోవు మున్నగు పశువులలోను, మామిడి చెట్టు మొదలగు జాతులలోను గన్పడు విచిత్రతను బట్టి చూడ ప్రపంచమున జాతులు, నుప జాతులు కలవనియే గోచరించును. ఇక నాజాతిభేదము మనుజులలో నున్న హానియేమి? వేదములందు కూడ అశ్వము, అర్వ, వాజి యను నశ్వజాతివర్ణన మున్నది. ఇట్లే వేదము లందు బ్రాహ్మణ క్షత్రియాది జాతులనేకములు వర్ణించబడి యున్నవి. వారి వారి కర్మలు కూడ వేరువేరుగ జెప్పబడి యున్నవి. వాటి నుపేక్షించిన శాస్త్రద్రోహము చేసినట్లే.

వివాహ ఆహార సంబంధమువలన జనులలో పరస్పర ప్రేమ, సంఘటనము పొసగుననుకొనుట వట్టి భ్రాంతి. ఆధునిక 'రష్యనులలోను, అమెరికనులలోను వివాహ ఆహార విచారణ ఏమియు జేయబడదు. అయినను వారిలో సద్భావము లేని కారణమున సంఘర్షము జరుగుచునే యుండును. కుక్కలలో