పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

హిందూకోడ్ బిల్ సమీక్ష

పెండ్లి చేసుకొనుట కెట్టియాటంకము లేకుండయున్నది. కాని యికముందు భార్యయనుమతించినను విడాకుల రిజిస్ట్రేషను చేసుకొననిదే రెండవ వివాహము చేసుకొనిన పురుషుడు శిక్షాపాత్రుడు కాగలడు. ఈవిధముగ విడాకుల చట్టమైనా ప్రచారములోనికి రాగలదు. లేదా భార్యాభర్త లిఱువురు విడాకుల చట్టమునుగోరి సంతానాపేక్ష చేత ముస్లిముమతమును స్వీకరించి రెండవ పెండ్లి చేసుకొనియైనా సంతానసుఖ మనుభవించెదరు. రెండవ పెండ్లి కాకపోదు. విడాకుల చట్టప్రకారము రిజిస్ట్రేషను చేసుకొనినగాని ద్వితీయవివాహము జరుగదు. రెండవ పెండ్లిని నిరోధించుటకునై సంయమముగా నుండవలయునని ప్రబోధింపబడుచుండెడిది. కాని యిప్పుడు విడాకుల నిర్మాణము,పెండ్లి రెండును సంయమము నుల్లంఘించమనియే ప్రోత్సహించు చున్నవి. ఇందు శాస్త్రవిరోధము సుస్పష్టమగుచునే యున్నది.

ఈబిల్లు ఆమోదింపబడిన మీదట పితృపితామహాదులు చేసిన ఋణములను తీర్పవలసిన బాధ్యత పుత్రపౌత్రుల కెవ్వ రికి నుండదు. ఇది కూడ చాలశాస్త్ర విరుద్ధము, నేటి వరకు తండ్రి విషయమున మిగిలియున్న లౌకిక పారలౌకిక కృత్యములను బూర్తి చేసి పితృఋణమును దీర్చుకొనుట పుత్రునకు కర్తవ్యమై యున్నది. ఈ పద్ధతి బిల్లుమూలమునతప్పక సమాప్తి చెందగలదు.

వర్ణ వ్యవస్థకాని, జాతి వ్యవస్థకానీ పనికిరాదనియు, ఒకే జాతి యుండవలయుననియు, జాతి భేదములతో నిమిత్తము