పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

33

రోగ, వ్యభిచార, ఉన్మాదాదులను నిరూపించుటకు నై యెన్నేని లేనిపోని కుట్రలు, పన్నాగములు బయలుదేర గలవు, కోర్టులో భార్యాభర్త లొండొరుల వ్యభిచార దోషములను నిరూపించుకొన మొదలిడుదురు. ఈదృశ్య మెంత యసహ్యకరమైనది ? నేటివరకు నెంతటి భయంకర పరిస్థితి యేర్పడినను, పెద్ద క్లిష్టపరిస్థితిలో కూడ నొకరు తోడ్పడినసు, తోడ్పడకున్నను భార్యాభర్త లొకరి నొకరు విడచి పెట్టుట లేదు. కాని యికముందు భయంకర జబ్బు పరిస్థితిలో నొకరి నొకరు విడచి పెట్ట బ్రయత్నింతురు. వాస్తవమున శాస్త్ర సమ్మతమగు వివాహమును జెరుపదగు నధికారము కోర్టునకు లేదు. విక్రయ, పరిత్యాగముల మూలమున గూడ భార్య భర్తనుండి వేఱు కాజాలదని శాస్త్రములు ఘోషించుచుండగా కోడుబిల్లువారు 'వివాహ మేయే యితర పద్ధతుల మీద నుచితమయ్యు వధూపక్షమువారు, వరపక్షమువారు సమాన గోత్ర ప్రవరలు కలవారయిన కారణము చేతను, వేర్వేరు జాతులకు గాని, సమానజాతినుండి విడిపోయిన యుపజాతికి చెందిన వారయిన కారణముచేతను, అనుచితము మాత్రము కాదని ఘోషించుచున్నారు. దీనిని బట్టి యీ హిందూకోడు హిందూధర్మము నెంతవరకు రక్షించగలదో దాని గుట్టు బాగుగ బట్టబయలైనది.

'కోడుబిల్లు ఒక భార్య జీవించియుండగా భర్త రెండవ పెండ్లి చేసుకొన వీలులేదని శాసించుచున్నది. నేటివరకు భార్య యనుమతిమీద సంతానాపేక్షతో బురుషుడు రెండవ