పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

హిందూకోడ్ బిల్ సమీక్ష

హిందూధర్మమందే జోక్యమును కలుగజేసుకొని మందిర ప్రవేశము, హిందూకోడు మొదలగు బిల్లులను ప్యాసు చేసి శాసనము చేయ నెంచుచున్నది. స్వతంత్రభారతము పేరటను, అఖండభారత దేశము పేరటను వర్తమాన ధారాసభ (బిల్లు లను ప్యాసుచేయు కమిటీ) ఎన్నుకొనబడినది. ఈ యెన్నుకొనబడిన ధారాసభ ధర్మవిరుద్ధములగు బిల్లులను ధార్మిక, సామాజిక రంగములందు విప్లవమును జెలరేగజేయు బిల్లు లనుదయారుచేసి ధర్మమును సమగ్రముగ నంత మొందించు నని ప్రజ లనుకొని యుండలేదు. కనుక నిట్టి బిల్లులను ఏర్పరచు నధికార మీ ధారాసభ కెంతమాత్రమును లేదు.

ఇంతియ గాక స్వతంత్రత లభించిన పిమ్మట చాల దేశీయరాజ్యములు భారతసంఘమునందు సమ్మిలితముగావింప బడిపోయినవి. వారియెడగూడ నీబిల్లులు చెల్లగలవు. కాని యీరాజ్యములలోని ప్రజలచే నెన్నుకొనబడిన ప్రతినిధి యెవ్వడును ప్రస్తుత ధారాసభలో గాన్పింపడు. కావున నీ ధారాసభచే నిర్మింపబడిన బిల్లుల నీరాజ్యములందు బలవం తముగ వ్యవహరింపజేయుట ఎంతయు నన్యాయము.

కోడుయందు గ్రహింపబడిన విడాకుల చట్టము దానికి గల కారణములు గూడ శాస్త్రవిరుద్ధములు. అసంగతములు. విమనస్కతను వ్యాపింపజేయునవి. విడాకుల చట్టము నిమిత్త ముగ రెండు సంవత్సరములవరకు విడచిపెట్టి యుండుటను గానికి బలాత్కరించుట మూలమున భీతి చెందుటనుగాని,