పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

31

నుల విషయమున నేదేని బిల్లు నిర్మించుటకు శ్రీ డాక్టరు మహాశయులకు శక్తి చాలదన్న మాట.

ఈ కోడుయొక్క పరిభాష లన్నియు శాస్త్రసీమల నుల్లంఘించునవియే. ఇందు 'సపిండ' శబ్దమునకు శాస్త్ర విరుద్ధమగు పరిభాష చెప్పబడినది. సపిండత్వమయిదు లేక నేడేండ్ల వరకు నుండునని శాస్త్రము లంగీకరించగా బిల్లువారు మూడు లేక నయిదేండ్లవరకు మాత్రమే యుండునని యంగీకరించి నారు. దత్తుని (పెంచుకొనబడినవాడు) విషయమునను, అంతర్జాతీయకన్యక యొక్క సంతానమువిషయము ననుఇంకను నిట్టి శాస్త్రవచనములు చాల గలవు. బిల్లులో శాస్త్రములను ప్రమాణముగ దీసుకొన్నప్పుడు సగోత్రవివాహము ఏల నిషేధింపబడ లేదు. అట్లు ప్రమాణముగ దీసికొన మందురా? అన్న చెల్లెండ్రయొక్కయు, పినతండ్రి సోదర పుత్రికల యొక్కయు, మేనత్తా సోదర పుత్రుల యొక్కయు, లేదా యిరువురు సోదరుల యొక్కయు, సోదరీమణుల యొక్కయు సంతతుల యొక్క వివాహములేల నిరోధింపబడవలయును! దీనికి స్థిరప్రమాణ మెయ్యది?

వర్తమానలోక దృష్టిచేతను గూడ ధర్మవిషయమున నొక బిల్లును నిర్మింప నొకరికెట్టి యధికారమును లేదు. భారతీయ ప్రభుత్వము ధార్మిక స్వాతంత్య్రమును స్వీకరింపను స్వీకరించినది. మహమ్మదీయ, క్రైస్తవులయెడ పాటింపను బాటించినది. కాని యీ యంతర్రాష్ట్రీయ నియమములకు, రాష్ట్రీయ నియమములకు విరుద్ధముగ నొక్క