పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

హిందూకోడ్ బిల్ సమీక్ష

మయినదేదియో నిశ్చయించుటయే కష్టము. ఆలయములు, అందలి విగ్రహములే ధార్మికములు కానిచో బజారులో విక్రయింపనున్న విగ్రహములను జూచియే సంతసింప వల యును. వివాహము ధర్మమే కానియెడల తండ్రీ కూతుళ్లకు నన్నచెల్లెండ్రకు బెండ్లిండు జరుగవలసినదే. కాని దేవాలయ ప్రవేశమునకు బ్రోత్సాహ మిచ్చుచున్న ప్రస్తుత బిల్లు ప్రతి పాదకు లీవిషయము నేలకో యంగీకరించుట లేదు. వాస్తవ మందు మహమ్మదీయాది మతములవలె ధర్మాధర్మ నిర్ణయ మును శాస్త్రములైన జేయవలె. లేక ధర్మాచార్యులైన జేయవలె. అంతియకాని 'మాకు సంప్రదాయములతో బని లేదు' అని చెప్పుకొను నీప్రభుత్వ మింత ప్రపంచమును విస్తరింపజేసి యీ సాంప్రదాయికపు బంకమున నేల జిక్కుకొన వలయును? ప్రభుత్వమువారు వేదాది శాస్త్రములను, ధర్మ శాస్త్రములను బట్టి హిందువులను ధర్మనిర్ణయము జేసుకొన నీయవలయును. ఆ శాస్త్రముల బట్టి ప్రస్తుత హిందూకోడు మున్నగునవి, ధర్మముమీద దాడి చేయుచున్నవనుమాట నిక్కము.

ఒకప్పుడు డాక్టరు అంబేడ్కరు 'ఏకపత్ని విధానము నమస్త ప్రపంచేతిహాసమునను గలదు' అని పలుకగా నొక మహాశయుడు 'మహమ్మదీయలా ' విషయమున దమయాశయ మేమని ప్రశ్నించెను. తోడనే వారు 'మహమ్మదీయమతమందెన్ని పెండ్లిండ్లయినను చేసుకొనవచ్చును, తప్పులేదు' అని సెలవిచ్చి తప్పుకొన్నారు. సారాంశ మేమియనగా ముసల్మా