పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

29

కంటె నత్యాశ్చర్యజనకమగు విషయమేది యంటే ప్రస్తుత బిల్లు ప్రతిపాదకులు ఒకయెడ “దాయభాగమునకు, ధర్మమునకు సంబంధ మేమి? ఇది లౌకిక విషయముకదా!" అని పల్కుచు శాస్త్రముల నించుకంతయైన లెక్క చేయక నిష్టము వచ్చినరీతిని నవీనదాయభాగ విధానమును ఏర్పరచుచున్నారు. వారే వేఱొకయెడ కన్యకు పైతృకసంపదయం దధికారము కలదని నిరూపించుటకునై మను, యాజ్ఞవల్క్యులు రచించిన

 "స్వేభ్యోంశేభ్యస్తు కన్యాభ్యః ప్రదద్యుర్భ్రాతరః పృథక్ |
  స్వాత్స్వాదంశాచ్చతుర్భాగం పతితాః స్యురదిత్సవః॥"
                                   (మను - 9 - 118)

ఇత్యాది వచనములు నాధారముగ దీసుకొని 'కన్యకు భాగమీయని సోదరుడు పాపి, పతితుడు సగు'నని చెప్పు చున్నారు. 'అవివాహితయగు కన్యయే తండ్రి యాస్తియందు భాగమును బొందనర్హురాలు' అని శాస్త్రములు చెప్పుచున్నవి. కాని యీబిల్లు వివాహిత, అవివాహిత ఇద్దఱు కన్యలకు గూడ తండ్రి యాస్తి యం దధికారము కలదని చెప్పు చున్నది.

'దేవాలయప్రవేశము, వివాహము, విడాకులచట్టము, వారసత్వము మొదలగునవి రాజ నైతిక విషయములు నమాజమునకు చెందినవి. వాటికి ధర్మముతోడ సంబంధము లేదు' అని నేటిజనులు కొందఱందురు. వివాహ, మందిర ప్రవేశాదులే ధర్మమునకు జెందినవి కానిచో నిక ధార్మిక