పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

హిందూకోడ్ బిల్ సమీక్ష

నకు మాత్ర మధిక లాభమున్నది. ఒకయెడ తండ్రి యాస్తి యందు ఆడపిల్లల కధికారము జూపుటయు, వేఱొక యెడ తండ్రికి విల్లు వ్రాయు నధికార మీయబడుటయు జూడగా నెంత యాశ్చర్యముగమో యున్నది. అనగా, తండ్రియాస్తి నాడపిల్లలకీయ దలంపనియెడల గొడుకుల పేర విల్లువ్రాసి యిచ్చి వేయవచ్చునట. ఇట్లు వీలుకాగితము వ్రాసిన తండ్రి కూతుళ్ల విరోధము, వ్రాయకున్న తండ్రి కుమారులకు విరో ధము. మఱియు నన్న చెల్లెండ్రకు కలహము.

ఇటు లెపుడయితే శాస్త్రధర్మముల విశ్వాసమడుగంటునో, అపుడర్దకామములే ప్రధానములగును. ఇక నాస్తుల యందలి కాంక్షలమూలమున నాడుబిడ్డల హత్యలు పెరిగి పోవును. ఏతత్సంబంధమగు నీర్ష్యలమూలమున నాడు బిడ్డలు తమ తండ్రులకు, సోదరులకు విషము నీయవచ్చును. తోడనే తల్లి యొక్కతే తప్ప మిగిలిన స్త్రీలందఱు వివాహార్హులే అను మహమ్మదీయాచారప్రకారముగ నాస్తులందలి కాంక్షల కొలది హిందువులలో గూడ నన్న చెల్లెండ్ర పెండ్లిడ్లు సంభవించును. శాస్త్రధర్మములందు విశ్వాస మేర్పడుట కష్టముకొని యంతరించుట కఠినము కాదు. సగోత్రవివాహము, నసవర్ణ వివాహము బ్రచలితమైనతోడనే రానురాను అన్న చెల్లెండ్ర పెండ్లిండ్లయందుకూడ నభిరుచి మెండుగును. ఎప్పటికైన శాస్త్రధర్మ విశ్వానమే ప్రజలను నీచాతినీచ ప్రవృత్తుల బడకుండ గాచునది. పై విశ్వాస మంతరించుటతోడనే ప్రజలను సవరించుట కఠినమేకాక నసంభవమయిపోవును. అన్నిటి