పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

27

మనుమలు, ముని మనుమలుకూడ దానిని పంచుకొనదగువారు ఆస్తియందు వ్యక్తులకు జన్మసిద్ధమయిన యధికారముండును. పైతృకసంపత్తును బంచుకొనదగు వాడెవడైన జనిపోయిన నాతని సంపద మిగతబ్రతికియున్న భాగస్థులకు జెందిపోవును. కాని బిల్లుయొక్క దాయభాగ సిద్ధాంతమును బట్టి వారసుని యాస్తి యాతనికి వ్యక్తిగతమైయుండును. అనగా నాతని కాయాస్తి యందు దానవిక్రయసత్తాధికారములు సంపూర్ణ ముగ నుండును.'లోకమాన్య తిలకు మహాశయుడు “న్వరా జ్యము మా జన్మహక్కు" అని ఘోషించగా, కాంగ్రెసు వాదు లందఱు దానిని మఱింత పెచ్చరిల్ల జేసిరి. కాని హిందువులు 'మా సంపదలో మాకు జన్మసిద్ధాధికార మున్నది' అనినపుడు వీరి యీ సిద్ధాంతమును బూర్తిగ నణగ ద్రొక్క ప్రయత్నించుచున్నారు. ఆస్తికి శాసనమూలమున నొక వ్యక్తి యేప్పుడయితే వారసుడగుమో, యప్పుడే మృత్యు కరపరిస్థితియు దటస్థించును. ఇందు మూలముననే సమ్మిలిత కుటుంబముల రివాజు నశించును. ఆస్తులు విభజింపబడి పోవును. అందు ప్రభుత్వమునకు గూడ భాగ మేర్పడును.

పూర్వ మాస్తిని మగపిల్లలే పంచుకొనెడివారు. ఇపు డాడపిల్లలుకూడ బంచుకొందురు. ఈ విధముగ భర్తృకుటుంబము యొక్కయు, పితృకుటుంబము యొక్కయు నాస్తులన్నియు నెన్ని భాగములైన సంతయధికముగా ప్రభుత్వము వారికి మృత్యుకరము ముట్టును. కుటుంబ మందలి యే వ్యక్తియు దగు లాభమును బొందనేరడు. కాని ప్రభుత్వము