పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

హిందూకోడ్ బిల్ సమీక్ష

కేసులను పెంపొందించుచున్నవో వాటినన్నిటి నొక క్రమస్థితికి దెచ్చుటే హిందూకోడు యొక్క లక్ష్యము” అని చెప్పబడినది. అనగా హిందూలానంతను స్పష్టముగను, సకలసుబోధము గను, ఏకరూపముగను జేయుటయు, దావాలను కేసులను నిరోధించుటయు హిందూకోడు యొక్క ఉద్దేశ్యము. కాని యీ బిల్లుమూలమున కేసులు దావాలు నెంత యధికమయి పోవునో మందుముందు పాఠకులకే తెలియగలదు. సోదరు నకు, సోదరికి సమానభాగము నిచ్చుటమూలముగను తండ్రికి విల్లు వ్రాయు నధికారమును వ్యవస్థ చేయటచేతను కేవల యొక్క యన్నచెల్లెండ్ర కేకాక తండ్రి కూతుళ్ళకు కూడ తగ వులు వచ్చి కేసులు దావాలు వృద్ధిపొందును. ప్రతి గృహమందు కన్య యొక్క యత్తగారుగాని, అద్దెవాండ్రు కాని అందలి కొంతభాగమును కొనుక్కొన్న యన్యజాతివ్యక్తులు గాని నివసించుటచేత నెంతెంతటి సంఘర్షణములు బయలు దేరునో , ఎన్ని కేసులు జరుగునో ప్రతివ్యక్తియు సులభముగ గ్రహించవచ్చును. అట్లే విభాజనముల మూలమునను, మృత్యుకరసంబంధముగను జరుగు కేసుల కంతముండదు. సంపదా నశించును, వివాహపు గిజిస్ట్రేషనులకును, విడాకుల చట్టము నిమిత్తముగను హైకోర్టులవరకు బోవలసివచ్చును.

బిల్లునుండి 'మితాక్షరా’ 'దాయభాగము' నను భేద మును దీసివైచి శాసనమునంతను ఏకరూపమును బొందించు టకు బ్రయత్నించిరి. 'మితాక్షరా'ను బట్టి హిందువునియాస్తి వ్యక్తిగతముకాక పైతృకమైయుండును. తండ్రి, కుమారులు,