పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

25

నిర్మించువారి యొక్కయు, స్వీకరించువారి యొక్కయు, మూర్ఖత్వకారణముగా నన్యమతస్థుల సంఖ్యయు, సంపదయు బెరిగి పోవును. శాస్త్రవిరుద్ధములగు నాచార వ్యవహారము లన్నియు బరిత్యజించవలసినవే. కాని శాస్త్రవిరుద్ధమగు హిందూకోడు మాత్రము ఏనాటికి శాస్త్రపదవిని బొందనేరదు సరి కదా ! అనాదినుండి వచ్చుచుండు నాచారవ్యవహారము లకు అభ్యంతరము కలుగును.

ఈ కోడుబిల్లు అమలుజరుగ మొదలిడిననాటినుండి పూర్వపుశాసనము రద్దగుటయు, ఇది భారత దేశమందంతటను వ్యవహరింపబడుటయు జరుగును. ఈ దృష్టి చేత నీ బిల్లు భారతదేశమునకు బయట జెల్లనేరదు. ఫలరూపకముగ నచటి (విదేశములందున్న) భారతీయులందఱియెడను విదేశ శాసన క్రమమే నిర్వహించబడును. ఒక యాంగ్లేయు డెచటనైన మృతిబొందిన నాతని సంస్కార దాయభాగాదులన్నియు నాంగ్లేయ శాసనప్రకారముగ జరుగుటయు, హిందువు డొక డెచటనైన జనిపోయిన నీతని సంస్కారదాయభాగాదు లాదేశ శాసన ప్రకారముగ జరుగుటయు నెంత శోచనీయవిషయము ! నిజముగ నీబీల్లు దేశము నాధారముగ జేసుకొని చేయబడినది, కాని యొక వ్యక్తినిగాని, జాతినిగాని యాధారముగ జేసుకొని చేయబడలేదు.

“హైకోర్టులయొక్కయు, ప్రీవీకౌన్సిలుల యొక్కయు నిర్ణయములందు వ్యాప్తి జెంది యేయే హిందూ శాసనము లయితే సాధారణజనుల కాశ్చర్యమునుగొల్పుచు దావాలను,