పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

19

మును ధర్మమని భావింతురనియు, వారు ధర్మము నుల్లంఘించ రను దాని భావ మధర్మము నుల్లంఘించరనియు మన మను కొనవలసి వచ్చును. అధర్మమును ధర్మమనుకొనువారు పూర్వము కూడ గొంద ఱుండెడివారు. కొందఱు రాక్షసులు పరదారాగమనమే తమ ధర్మమని భావించెడివారు. ఇట్టి స్థాన ములందు ధర్మశబ్దము నుపయోగించుట భ్రాంతి మూలక మని సుస్పష్టమైనది, “ చోదనాలక్షణో౽ర్థో ధర్మః" "తస్మాచ్ఛా త్రం ప్రమాణం తే" ఇత్యాది వచనములద్వారా శాస్త్ర విహితకర్మమే ధర్మమనియు, శాస్త్ర నిషిద్ధ కర్మమే యధర్మ మనియు వ్యక్తమగుచున్నది. బహిరంగముగా నంతర్జాతీయ వివాహములను, విడాకుల చట్టమును, సంకరసృష్టిని బ్రోత్స హించు హిందూకోడుబిల్లు వలన ధర్మమెట్లు రక్షింపబడును? ధర్మమును గ్రహించుటకు ముందాధర్మమును, దాని ప్రమాణమును నిర్ణయించుకొనవలసివచ్చును. అందులకై వేదము లను, ధర్మశాస్త్రములను పూర్వమీమాంసను విమర్శించవలసి యుండును. ధర్మము పేరట నేవియో కొన్ని వాక్యములను వ్రాసినంత మాత్రమున ధర్మనాశకమగు కోడుబిల్లు ధర్మ రక్షక మగునా! సారాంశ మేమియనగా హిందూకోడును నిర్మించువారిచే కల్పింపబడిన ధర్మమును ద్యజించునాతడే యిచట హిందూధర్మత్యాగి యని యూహింపబడును. కాని శాస్త్రవిరుద్ధధర్మ మెప్పటి కైనను నధర్మమే. ఈ యధర్మమునే కోడుబిల్లును ప్రతిపాదించు వారు ధర్మమని భావించుచున్నారు.