పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూకోడ్ బిల్ సమీక్ష

సామాన్య వివేచనము

హిందూకోడు బిల్లునందెన్ని మారులో హిందూధర్మ మను నామము వచ్చినది. కాని హిందూధర్మమన నేమి ? దానికాధారస్వరూప ప్రమాణంబు లెవ్వి ! యను విషయము విచారించబడినటు లెచ్చటను గానరాదు. కావున నిది యపూ ర్ణము. ప్రయోజనము లేనిది. హిందూకోడును సమర్థించుచు నొక మహాశయు డిటు లనెను "ఈ బిల్లు హిందూధర్మమును రక్షించునది కాని భక్షించునది కాదు. కారణమేమియనగా ఈబిల్లుమూలమున హిందూధర్మమును ద్యజించునాతని కనేక యధికారములు లేకుండ జేయబడినవి. హిందూధర్మమును బరిత్యజించినవా డల్పవయస్కులను, నజ్ఞానులను పాలింప వీలు లేనట్లే యువతి పునర్వివాహము జేసుకొన్నను, హిందూధర్మమును విడనాడినను దత్త తాధి కారము లేనిదగును. " ఈ విధముగ ననేక ప్రమాణముల మూలమున కోడుబిల్లువారు హిందూధర్మ రక్షణమే కోరు చున్నారని నిరూపింపబడినది. కాని హిందూకోడు బిల్లునందీ వాక్యము లున్నను వేదాది శాస్త్రములకు విరుద్ధముగా నసవర్ణ వివాహమును, సగోత్రవివాహము, విడాకులచట్టము - స్పష్టీకరింపబడినవనగా, ఈబిల్లును బ్రతిపాదించువారు అధర్మ