పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహావలోకనము

17

భారతీయ నవీన విధానమునకు మూలభూతమగు ఘోషణ యందు 'ఏధర్మమందు ప్రభుత్వ మెట్టిజోక్యము కలుగజేసు కొనద’ను విషయము అంగీకరింపబడినది. ఇంతియ గాక నానియమము క్రైస్తవ ముస్లిము మతములయెడ బాటింప బడుచును ఉన్నవి. కాని యొక్క హిందూధర్మముయెడనే యానీతి పాటింపబడుట లేదు. పైగా నానీతిని బాటించుచునే యున్నామని యనుకొనుటకై వివాహ దాయభాగములు ధర్మములు కావనియు, నవి సాంఘిక వస్తువులనియు ప్రభు త్వమువారు చెప్పుచున్నారు. కాని యా యా ధర్మములను బరిశీలించునపు డాయా సంప్రదాయములకు సంబంధించిన ధర్మగ్రంథములను అనుసరించవలయునను విషయముస్పష్టము. ఈదృష్టి చేత హిందూధర్మవిమర్శనము హిందూధర్మ గ్రంథము లను, హిందూధర్మాచార్యులను అనుసరించి చేసినపుడు ప్రస్తుత హిందూకోడుబిల్లు హిందూధర్మముమీద నెట్లుగా దాడిచేయుచున్నదో సుస్పష్టము కాగలదు. గోవధవంటి నీచ కృత్యములను మహమ్మదీయధర్మ మను తలంపుతోడ ప్రోత్సహించుటయు, హిందువుల వివాహ, దాయభాగ, మందిరాది శుద్ధ ధార్మికవస్తువులను, సామాజికములను తలంపుతోడ నణచివేయ బూనుకొనుటయు జూడగా నత్యాశ్చర్య మొదవుచున్నది.