పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

హిందూకోడ్ బిల్ సమీక్ష

నరకప్రాప్తి యగునో , లేక స్వర్గము లభించునో అను విషయ మీశ్వరునికే తెలియవలయునుగాని యన్యుల కేట్లు తెలి యును? ఈశ్వరుఁడే యనంతకోటి బ్రహ్మాండముల నెరుగును. ఆతడే యొక్కొక్క బ్రహ్మాండ మందలి జీవులను, ఒక్కొక్క జీవుని యనంతానంత జన్మలను, ఒక్కొక్క జన్మ యొక్క యనంతకర్మములను , ఒక్కొక్క కర్మయొక్క లెక్క లేనన్ని విచిత్రఫలితములను ఎరుగును. ఫలమునిచ్చు శక్తియు నాతనికే కలదు. కనుక నాతని విధానమే ధర్మాధర్మములకు బ్రమాణము. ఇందు చేతనే హిందువులు వేదములను, వాటి ననుసరించి నిర్మితములైన యార్షగ్రంథములను మాత్రమే తమ విధానములగా భావింతురు.

మఱియు దానిని మార్పు జేయ నెవ్వనికి పెట్టి యధికారము లేదని యూహింతురు. ఈశ్వరుడు, నాతని రామకృష్ణాది యవతారములు. వసిష్ఠుడు, మనువు మున్నగువారు కూడ నావిధానములనే పాటింప నుపదేశింతురు. కాని మార్పు చేయుటకు వారికెట్టి యధికారమును లేదు. కావుననే నిశ్వాసములవలె బుద్ధిప్రయత్ననిరపేక్షములు అగుటచే వేదములు అకృత్రిమములు, నపౌరుషేయములు నని చెప్పబడినవి. యెడ వాటికి విరుద్ధ విధానముల దయారుచేయ నెవ్వనికి నెట్టి యధికారమును లేనేలేదు. ఇంతియగాక ప్రతి రాష్ట్రమునకు, నంతర్రాష్ట్రీయలోకమునకు శాసనమూలమున నొ కధర్మమందు జోక్యము కలుగ జేసుకొనకుండుట నియమమైకూడ యున్నవి. సంయుక్త రాష్ట్ర సంఘముకూడ నీవిషయమునే ఘోషించును.