పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహావలోకనము

15

నంతవరకు, లేదా తాను పరాజయమును బొందనంతవరకు, లేదా తనవిధానమం దాతనికి లోపము గోచరించనంత వరకు ఆతని విధానమందు పరివర్తనమును దెచ్చుట కొకని కెట్టి యధికారము నుండదు. ఈశ్వరుడు నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సమేతుడును కావున నాతనిలో బూర్వోక్తావస్థలు సంభవింపనేరవు, అట్టిస్థితియందాతని విధానము నొక రెట్లు మార్పు చేయగలరు? ఇంతియగాక ఫలము నిచ్చువాడే ధర్మాధర్మములను మార్పు చేయగలడు. ఆ ఫలము నీశ్వరుడు తప్ప నేవ్యక్తి యు సమూహము నీయజాలదు. కనుక నెవరికిని ధర్మాధర్మముల మార్పుచేయు నధికారము లేదు. పత్రముల యొక్కయు, వ్యక్తులయొక్కయు సమ్మతుల కచ్చట విలువయేమియు లేదు. ధర్మాధర్మములు మార్పు చేయుటకు గాని, చేయకుండుటకు గాని ఫలప్రదాత యగు పరమేశ్వరుని సమ్మతియే ముఖ్యము. అతని హస్తాక్షరము లేక సమ్మతియు లేనిదే యర్భుదముల కొలది విద్వాంసుల సమ్మతులున్నను ప్రయోజనము లేదు. అనాదులు నపౌరుషేయములు నగు వేదములే యాతని నిశ్శ్వాసభూతవచనములు. అవియే యాతని నిత్యజ్ఞానానువిద్ధ. మగు శబ్దరాశి, దానికి విరుద్ధములగు సమ్మతులన్నియు వ్యర్థ ములే. ఒక వ్యక్తి తన జన్మకర్మములనే యెరుగడు గదా! యెరింగినను ఫలప్రాప్తి యాతని చేతిలోనిది కాదుగదా ! ఇట్టి స్థితియందు నగోత్ర వివాహముల వలనను, అంతర్జాతి వివాహ ముల వలనను పుణ్యమొదవునో , లేక పాపమే యొదవునో ,