పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

హిందూకోడ్ బిల్ సమీక్ష

మానమ్ " ఆది జైమిని సూత్రములను బట్టి పూర్తిగ స్పష్ట మగుచునే యున్నది. వేదముల ననుసరించియే స్మృతులన్నియు నేర్పడినవి. నేడు క్లిష్టాక్లిష్ట పరిస్థితుల నన్నిటిని దృష్టిలో బెట్టు కొని యెట్లుగ విధానములు చేయబడుచున్నవో అట్లే పరమేశ్వరుడును సర్వదేశకాల పరిస్థితులను దృష్టియందుంచు కొనియే యీనిత్య విధానమును రచించెను. కాని భేదమేమి యనగా లౌకిక విధానములను నిర్మించువా డల్పజ్ఞుడు. కావున నాతని విధానమందు లోపములుండును. భగవంతుడు సర్వ జ్ఞుడు కావున నాతని విధానమం దెట్టి లోపము నుండదు. ఆపత్తి సంపత్తి కాలభేదమునుబట్టి సూక్ష్మముగను విప్రకీర్ణము గను వేదములందు చెప్పబడిన ధర్మములనే సంకలన మొనర్చి స్మృతికారులు స్మృతులను నిర్మించిరి. శ్రుతేరివార్థం స్మృతి రన్వగచ్ఛత్' " శ్రుతి విరుద్ధమగు స్మృతి యేదియైనను త్యజించవలసినదే. అట్టియెడ నేటి మనుజు డెవండైన వేద విరుద్ధవిధానమును నిర్మించిన దాని నెట్లు గ్రహించనగును? నేటివరకుగల "హిందూలా”మితాక్షరా శాసనపద్ధతి దాయ భాగముకూడ మను, యాజ్ఞవల్యుల మీదను, వేదముల మీదను ఆధారపడి నిర్మితములైనవి. నేటివరకు హైకోర్టు లందును, ప్రీవీకౌన్సిలు లందునుగూడ నీవచనముల యర్థ ములే గ్రహింపబడును. స్వేచ్ఛాచరణమునకు సాహసింప బడుట లేదు. ఈ దృష్టి చేతను గూడ నేటి హిందువుల విధానము వేదమే. ఈశ్వరుడు మృతిఁబొందనంతవరకు, లేదా యవకాశ మును గ్రహించి తన యధికారమును హస్తాంతరిత మొనర్చ