పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహావలోకనము

13

వలనను సిద్ధింపనేరవు. వానిమూలమున నట్టిపుణ్యమును లభింపనేరదు. ఒక మంత్రమందలి వాక్యములను, పదము లను వెనుక ముందునుంచి జపించుట చేతను కూడ నట్టి ఫలము లభింపదు. అట్టియేడ “రైస్ బాల్ ” అను శబ్దమునుండి తండుల పిండమనియు, స్తంభశబ్దమునుండి యూపమనియు నర్థము లెట్లు వెలువడును? పిండము, యూపము, ఆహవనీయము మున్నగువానినుండి ఆయా సంస్కారములతో గూడిన ధార్మికార్థములే గ్రహింపబడును, కావున హిందువుల యొక్క ధార్మికజీవన నిర్వహణవ్యవస్థయు సామాజిక జీవన నిర్వహణ వ్యవస్థయు మూలంబులగు వైదిక గ్రంథముల మీదను, నార్ష గ్రంథములమీదను ఆధారపడి యున్నవి. లోకదృష్టియం దేదేని నిర్విఘ్నముగను, దోషరహితముగను సాగిపోవు వేరు మార్గ మున్నను నది యాస్తిక్య బుద్ధికల హిందువులకు గ్రహణీయము కాదు. స్మశానాగ్ని చేత పప్పు, బియ్యము నుడుకబెట్టుకొన వచ్చును. కాని యాస్తికు డెన్నడు నట్టిపని చేయడు.

స్మృతి పురాణముల యొక్కయు, మహర్షుల యొక్కయు విచిత్రములగు విభిన్న వచనములను జూచి కొందఱు జనులు శాస్త్రములు, ధర్మములు దేశకాల పరిస్థితి ననుసరించి మారు చుండుననియు, - విభిన్నస్మృతికారులు తమ దేశకాల పరిస్థితి సనుసరించి ధారణపోషణానుకూలముగా రచించిన నియమములే శాస్త్రములనియు జెప్పుదురు. కాని యట్లు చెప్పుట పూర్తిగ ససంగతము. “ విరోధే త్వనపేక్షంస్యా దసతి హ్యను