పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

హిందూకోడ్ బిల్ సమీక్ష

యుండును. అది బుద్ధిప్రత్యయసాపేక్షము కాదు. కావుననే యకృత్రిమము. నపౌరుషేయము ననబడినది. కేవల జీవుడే కాదు. ఈశ్వరుని బుద్ధిప్రయత్నములుకూడ వేదనిర్మాణమం దపేక్షింపబడవు. ఈశ్వరబుద్ధి ప్రయత్న నిరపేక్షములు. నకృ త్రిమములు, పురుషులవలన గలుగు భ్రమప్రమాద విప్రలిప్సా కరుణాపాటవాది దోషములచే స్పృశింపబడ నేరనివి నగుట చేత వేదములు స్వతంత్రరూపమునఁ బరమ ప్రమాణములు. వాస్త వమున కదియే విశ్వవిధానము. నేడు కూడ భారతీయులలో జాలభాగ మావిధానమునే మన్నింతురు. సారాంశమేమి యనగా సనాతనపరమాత్మ సనాతనజీవాత్మలను సనాతనా భ్యుదయపరమపదముల బొందింవ తన నిశ్శ్వాసభూతము లగు నిత్యజ్ఞానానువిద్ధములగు సనాతనవేదములద్వారా నిశ్చ యించిన సనాతనమార్గమే హిందువుల సనాతన వైదిక ధర్మము. "సనాతనస్త్వం పురుషో మతోమే” "జీవభూతన్సనాతనః” "ఛందాంసీ యస్యవర్ణాని" "అశ్వత్థం ప్రాహురవ్యయమ్ “త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా" యున్నగు గీతావచనము లను బట్టికూడ పరమేశ్వరుడు, జీవుడు, వేదములు, ధర్మము ఇవన్నియు ననాతనములని సిద్ధమగుచున్నది. హిందూధర్మశాస్త్రములద్వారా చేయబడిన ప్రతివ్యవస్థ యందును ధార్మికసంస్కారములకు సాన్నిధ్యము కలదు. గాయత్రీ మొదలుగాగల మంత్రములవలన నేయే కార్యములు సిద్ధించుచున్నవో ఆయామంత్రముల యర్థములతోడ సమా నార్ణమునిచ్చు నన్యమంత్రములవలనను, ఇతరభాషాపదంబుల