పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహావలోకనము

11

ఏదేని చిన్న రాష్ట్రముయొక్క శాసనమునకుఁగూడ నొక విధానమపేక్షితమైయుండగా నిక ననంత బ్రహ్మాండాత్మక జగత్తుయొక్క శాసనమొక విధానము లేనిదే యెట్లు పొసగును? ఒక యంగుళపు భూమి, యొక ప్రకాశము, నొక వృక్షము, నుద్యానకూప సరోవరాదికము గూడ నొక శాసకుడు లేక ప్రభువు లేకుండ యుండవుగదా! అట్టియెడ సూర్యచంద్ర నక్షత్ర వన పర్వత సాగరాదికము బ్రహ్మాండము నొకశాసకుడు లేనిదే యెట్లు నడువగలవు? ఈదృష్టిచేత నిందుకుగూడ తప్పక నొక విధానముండి తీరవలయును. తాత్కాలికులగు నియామకునకు, నియమింపబడువానికి నొక తాత్కాలిక విధానమెటులుండుమో యటే సనాతననియామకునకు, నియ మ్యునకు మధ్యనుండు విధానము గూడ సనాతనమే అయి యుండవలయును.అందుచేతనే వేదరూపవిధానముకూడ సనాతనమని చెప్పబడినది. ఈశ్వరీయ సనాతన విజ్ఞానమం దనువిద్ధము లగుటచేతను ఈశ్వరీయనిశ్వసితము లగుట చేతను గూడ నవి సనాతనములే. నిశ్శ్వాస మెట్లుగ జీవితదశను సూచించునో యట్లే వేదములు పరమేశ్వరస్థితి (సత్తా) ని సూచించును. ప్రాణి జీవించియున్నంత వరకాతని శ్వాసలు నడచుచునే యుండును. ఇట్లే పరమేశ్వరుఁ డున్నంతవరకు వేదములు నుండును. ఈశ్వరుఁడు సనాతనుడు కావున నాతని శ్వాసలుకూడ సనాతనములే. నిశ్వాసములయిన కారణము చేతగూడ వేదము లకృత్రిమములని రూఢమగుచున్నది. నిద్రయందు, జాగరణముందు న న్ని వేళల శ్వాస నడచుచునే