పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

హిందూకోడ్ బిల్ సమీక్ష

వలసియే యుండును. ఈశ్వరుడుకూడ నేయే శబ్దముల ద్వారా శబ్దారసంబంధమును నిరూపించునో యా శబ్దములను ముందుగనే యంగీకరించవలసి యుండును. అంగ ప్రత్యంగ సంకేతముతోడ ననంతశబ్దములకు, నర్థములకు సంబంధము నూహించు టసంభవమే. ఈశ్వర విజ్ఞానము ననుసరించియు, తదనువిద్ధశబ్దముల ననుసరించియునే విశ్వసృష్టి జరుగు చున్నది. ఇదియే మూలస్థితి. కావున వ్యక్తులను, ఆఖ్యానము లను గనుగొన్నంత మాత్రమున వేదకాల నిర్ణయము కాజాలదు. యోగి యైన వాడు ఋతంభరాప్రజ్ఞ ద్వారా భూతభవిష్యద్వర్తమానములను దెలుసుకొనగలడు. వాల్మీకి మహర్షి యటవియందుండి ఋతంభరా ప్రజ్ఞద్వారా స్థూల సూక్ష్మంబులు, సన్నికృష్టవిప్రకృష్టంబులు నగు ఘటనలను ప్రత్యక్షముగ గనుగొని రామాయణమును రచించగలిగి నప్పుడు పరమేశ్వరీయ విజ్ఞానమగు వేదమందు సంపూర్ణ వస్తు బోధమున్నదనుటయందాశ్చర్య మేమియున్నది?

శ్లో॥ "చాతుర్వర్ణ్యం త్రయోలోకాశ్చత్వార శ్చాశ్రమాః పృథక్ |
    భూతం భవ్యం భవిష్యచ్ఛ సర్వం వేదాత్ప్రసిధ్యతి |
    శబ్దః స్పర్శశ్చ రూపంచ రసో గంధశ్చ పంచమః ।
    వేదాదేవ ప్రసూయన్తే ప్రసూతిర్గుణ కర్మతః॥"
                                (మను - 12 - 97, 38)

'అత ఏవచ నిత్యత్వమ్' (బ్ర. సూ.) 'అనాది నిధనానిత్యాః' ఆదివచనములచేత వేదములు నిత్యములని సిద్ధమగుచున్నది.