పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహావలోకనము

9

ఈ విషయమే బ్రహ్మసూత్రములందుగూడ పేర్కొన బడినది. -“శబ్ద ఇతిచేన్నాతఃః ప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యామ్" అనగా వేదములందు వర్ణింపబడిన వ్యక్తుల ననిత్యులగా భావించినయెడల వారిని ప్రతిపాదించు వైదికశబ్దములు కూడ సనిత్యములని భావింప బడగలవు. వేదములం దనిత్యత్వ మారోపింప బడకూడదు. కారణమేమియనగా, వేదముల మూలముననే వ్యక్తుల సృష్టి జరుగు చున్నదను విషయము ప్రత్యక్షముచేతను అనుమానము (శ్రుతిస్మృతులు ) చేతను రూఢమగుచున్నది. పరమేశ్వరుడు "ఏత' శబ్దము చేత దేవత లను ' అసృగమ్' శబ్దము చేత మానవులను, 'ఇందవః' శబ్ద ముచేత బితృదేవులను, 'తిరః పవిత్రమ్' శబ్దము చేత గ్రహము లను 'భూః' శబ్దముచేత బృథివిని నిర్మించెను. - "స భూరితి వ్యాహరత్త స్మాద్భువ మసృజత, ఏత ఇతివై ప్రజాపతిర్దేవాన సృజతాసృగమితి మనుష్యానిందవ ఇతి పితౄంస్తిరః పవిత్ర మితి గ్రహానాశవ ఇతిస్తోత్ర విశ్వానీతి శాస్త్రమభిసౌభగే త్యన్యాః ప్రజాః " ఇవ్విధముగ సృష్టి జ్ఞానపూర్వకముగను, శబ్దపూర్వకముగను జరుగును.

లోకమందు వస్తూత్పత్తి యనంతరమున నామకరణమను విషయ మనిత్య శబ్దార్థములయెడనే చరితార్థమగునని చెప్పవచ్చును. ‘గో’ ఆదిగాగల శబ్దము లెన్నియేని కలవు. వాటిని నిర్మించిన వ్యక్తి కానరాడు. వాటిని నిత్యములనియే భావించవలయును. శబ్దార్థనంకేత మొనర్చ నాతఁడుకూడ .యాసం కేతముకొఱ కేవియో కొన్ని శబ్దముల నాశ్రయింప