పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

హిందూకోడ్ బిల్ సమీక్ష

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్ధాన్ విపరీతాంశ్చ బుద్ధి స్పాపార్థ తామసీ ॥
                                       (గీత 18-82)

అందఱను ఏకసూత్రమున బంధించునది యని చెప్ప బడుచున్న యీబిల్లునం దెచటను ధర్మశబ్దమునకు బరిభాష చెప్పబడ లేదు. 'హిందూ' శబ్దమునకు మాత్రము పరిభాష చెప్పబడినది. కాని యానిర్ణయమే ధర్మమును బొందకుండ జేయబడినది. మహమ్మదీయడు, క్రైస్తవుడు మున్నగువాని పరిభాషలకు వారి ధర్మగ్రంథములాధారములు. కాని హిందూ శబ్దమునకు పరిభాష వేఱొక నిషేధము నాధారముగ జేసు కొనియో లేక నసమంజసాధారమును గైకొనియో చేయ బడినది.

ఇందు 'హిందూధర్మముయొక్క యే స్వరూపమును, సంప్రదాయమును స్వీకరించువాడయినను హిందువుడనబడు' నని చెప్పబడినది. కాని యీశ్వరుడు, అస్తేయము, ధృతి మున్నగువానిని హిందువులు కానివారుకూడ స్వీకరింతురు గదా! అట్టియెడ నందఱు హిందువులేల గాజాలరు? ఒకయెడ 'హిందూ ధర్మముయొక్క. యేస్వరూపమును, సంప్రదాయమును గ్రహించినను మనుజుడు వీరశైవము, లింగాయతము, బ్రహ్మ సమాజము, ప్రార్థనాసమాజము, నార్యసమాజము - వీటిలో నేయొక దానికి సదన్యుడయ్యు హిందువు డనబడును.' అని చెప్పబడినది. కాని హిందూధర్మముయొక్కయు, సంప్రదాయము యొక్కయు బరిభాష, ప్రమాణము నావశ్యకము