పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

హిందూకోడ్ బిల్ సమీక్ష


ఈ వచనమును బట్టి తృతీయ, చతుర్ధములందు గూడ వివాహము విధించబడినది. కాని యది సంగతము కాదు. ఏలయన పూర్వోక్త వచనములకు విరుద్ధముగ నుండుటచేత దాని భావమును దత్తుని సంబంధములను, సవతి సోదరుని సంబంధమును లేదా క్షత్రియాదుల సపిండతమ గూర్చియు గ్రహించు కొనవలయును. ఇట్లు 'మదన పారిజాతము'ను * బట్టి నిర్ణయ సింధుకారులు నిర్ణయించినారు.

శాస్త్రవిశ్వాస మడుగంటిన తోడనే తండ్రి యాస్తి లో నాడుబిడ్డకు భాగము లభించుట కారణముగా సోదరితోడ సోదరునకు వివాహము ఎటులైన జర్చలోనికి వచ్చితీరును. ఒక కోటీశ్వరుడుగు సోదరుడు తని సోదరిని 50 లక్షలను ఒరుల కీయనినెంచునా? రెండు వస్తువులను దన యింటనే యేల నుంచుకొన కూడదు। సగోత్రవివాహము, అసవర్ల వివావాము, సపిండ వివాహములు జడగుట లేదా? అట్లే చెల్లెలును మాత్రమేల బెండ్లాడకూడదు? ఇటువంటి విచార ములు వచ్చుటతోడనే యందఱు నన్న చెల్లెండ్ర వివాహమును గూడ గోరుకొందురు.

ఒక్కొక్క మహాశయుడు సివిలు వివాహమును గూడ సిద్ధాంతీకరింప నెంచుచున్నాడు. కాని డాక్టర్ అంబేద్కరుగారు రిజిష్టరు వివాహమునకు సపిండత్వము తోడ నిమిత్తము లేదని యంగీకరించుచున్నారు. అనగా 5, 7 తర ముల విషయ మెటులున్నను, 3, 5 తరములలోపల స్త్రీ పురుషులకు వివాహములు జరుగ వచ్చునన్నమాట.