పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

103

"శూద్రాం శయనమారోప్య బ్రాహ్మణో యాత్యధోగతిమ్
జనయిత్వా సుతం తస్యాం బ్రాహ్మణాదేవ హీయతే”
                                    (మను. 8-17]

బ్రాహ్మణాదులకు శూద్రాది వివాహ మెంతయు హానికరము. ప్రతిలోమనివాహ మంతకంటెను నిందనీయ విషయము. క్షత్రియునివలన బ్రాహ్మణ కన్యకు గలిగిన సంతతి సూతులనబడుదురు. వైశ్యునివలన క్షత్రియకన్యకు గలిగిన సంతతి మాగధవంసంతతి యనియు, విప్రకన్యకు గలిగిన సంతతి వైదేహసంతతి యనియు జెప్పబడినది. శూద్రుని వలన విప్రకన్యకు గలిగిన సంతతి చండాలసంతతి యగును.

"క్షత్రియాద్విప్రకన్యాయాం సూతాభవతి జాతితః
వైశ్యాన్మాగధ వైదేహో రాజవిప్రాంగనాసుతౌ
శూద్రాదాయోగవః క్షత్తా చాండాలశ్చాధమో నృణామ్
వైశ్యరాజన్య విప్రాసు జాయంతే వర్ణసంకరాః" [మను 10-11,12]

వ్యభిచారేణ వర్ణానామవేద్యా వేదనేనచ
స్వకర్మణాం చ త్యాగేన జాయంతే వర్ణసంకరాః" [మను. 10-24]

కౌటిల్యుడు కూడ నిది చాల యనర్లకారి యని చెప్పినాడు. శూద్రునకు శూద్రవర్ణ స్త్రీయే భార్య కాగలదు.

"శూద్రస్యతు సవర్ణైవనాన్యా భార్యా విధీయతే"

.....గూడ హిందూకోడు ధర్మసమ్మతమైనదని చెప్పుచున్నారంటే యెంతయో యాశ్చర్యముగ నున్నది! అసవర్ణ వివాహము, సగోత్రకవివాహము శాస్త్రము లందు నిషేధింపబడినవి.