పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

హిందూకోడ్ బిల్ సమీక్ష

"ఎవండైన జాతిచేతను బ్రాహ్మణుడు కాదు గుణము చేతను, నడతచేతను బ్రాహ్మణుడగును." శాస్త్రములందిట్టి వచనము లెన్నియో గానవచ్చును. కాని యవి గుణమును, నడతను బ్రశంసించుటకే చెప్పబడినవని యెరుంగవలెను. ఎట్లనగా " యో౽ర్డే శుచిః సహి శుచిః నమృద్వారిశుచిశ్శుచిః " ధనముయొక్క పవిత్రతయే నిజమయిన పవిత్రత మృత్తికా జలముల ద్వారా సంపాదించిన పవిత్రత పవిత్రతయే కాదు. ఇది యర్థశుద్ధిని బ్రశంసించుటకు చెప్పబడింది. కాని మృత్తికా జలంబుల శుచిత్వము నిషేధింపబడినదని భావము కాదు. విద్యావిహీనుని బశువందురు “విద్యావిహీనః పశుః ” అట్లే దోష కృత్యములను సేయుటచేత శూద్రుడగునని కూడ చెప్పబడినది. "త్య్రహేణ శూద్రో భవతి" వాస్తవార్థమేమనగా మనుజుడు పశువు కానేరనట్లే బ్రాహ్మణాదులు శూద్రాది జాతులలోనికి మారజాలరు. కర్మణా వర్ణవ్యవస్థ పూర్తి నసంగతము. బుద్ధిమంతుడెవ్వడు సంగీకరించడు. కర్మణా వర్ణ వ్యవస్థయందైన కొలది నియమము లున్నవి. కాని హిందూకోడులో వర్ణవ్యవస్థనే దీసివైచి నారు. సంకరసృష్టికి ప్రయత్న మొనర్చుచున్నారు.

అనులోమవివాహమును గూడ వసువు నిషేధించి నాడు. శూద్రస్త్రీని బెండ్లాడుటచే బతితుడగును. "శూద్రా వేదీ పతతి " శయ్యమీద శూద్రస్త్రీని పరుండబెట్టుట చే బ్రాహ్మణున కధోగతి సంభవించును, పుత్రుడు కలిగినచో బ్రాహ్మణత్వమే పోవును.