పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

101

సిల్లువాడు ముఖ్య బ్రాహ్మణు డనబడును. స్వాభావిక గుణ విహీనుడైనచో జాతి బ్రాహ్మణుడనబడును. కాని బ్రాహ్మణ దంపతులకు జన్మింపని వారియందుగూడ బ్రాహ్ళణోచిత గుణ కర్మాదులుండటచే గౌణ బ్రాహ్మణత్వ మారో పింపబడుచున్నది.

"విద్యా తపశ్చ యోనిశ్చ త్రయం బ్రాహ్మణ్య కారణమ్
 విద్యా తపోభ్యాం యో హీనో జాతిగ్రాహ్మణ ఏవ సః "
                                    [మ. భా .]

గోవుయొక్క గుణములు కల యాడుగాడిదను గాని, యాడు కుక్కనుగాని 'గోవు' అని భావించి వైతరణిని దాటుటకై దానము సేయుదురా ? తేజస్సు మొదలుగాగల గుణము లన్నియు గలదయ్యు స్మశానాగ్ని నుపయోగింతురా? బ్రాహ్మణోచిత గుణకర్శములు కలిగియుండియు నబ్రాహ్మణునకు బ్రాహ్మణునితోడ వివాహ ఆహార సంబంధము పనికిరాదు. మహాభారతమందు కూడ స్పష్టీకరింపబడి యన్నది "మతంగు డనువాడు పెక్కేండ్లు తపము చేసియు బ్రాహ్మణత్వమును బొందలేదట నిషాద గ్రామ మందుండి కర్మభ్రష్ఠుడైన యొక జాతిమాత్ర బ్రాహ్మణుని వలన గరుడుని కంఠమందు తాపము కలిగినది. ఇవన్నియు జన్మనా వర్ణవ్యవస్థను బోషించు చరిత్రములు. భీష్ముడు. యుధిష్ఠిరుడు పరమ శమదమాది గుణ సంపన్ను లయ్యు బ్రాహ్మణు లనబడ లేదు.