పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

హిందూకోడ్ బిల్ సమీక్ష


హేతుత్వము మాత్రము చెప్పబడినది. కాని పూర్వోక్త శ్రుతుల ప్రకారము జన్మాంతరమందలి గుణకర్మలను బట్టియే బ్రాహ్మణాదు లేర్పడుదురు. కార్యమునకు ముందే కారణ ముపయోగింపబడును. కార్యానంతరము కారణముండదు. ఘట కారణములగు మట్టి, కఱ్ఱ, కుమ్మరి మొదలగునవి ఘటోత్పత్తికిముందే కావలసి యుండును. ఉత్పత్తి కారణములు అన్య ఘటమునకు కారణములగును. కాని ఉత్పన్న ఘటమునకు గారణములు కావు. ఇట్లే ప్రాక్తన గుణకర్మలే బ్రాహ్మణాదుల యుత్పత్తికి కారణములగును. ఈ పుట్టిన బ్రాహ్మణాదుల గుణకర్మల యుపయోగము మఱల జన్మాంతర మందు జరుగును. కాని యుత్పన్న కార్యమందు జరుగదు. ఈవిషయమే "చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః" ఆదులలో చెప్పబడినది. పరమేశ్వరుడు గుణకర్మానుసారముగా సృష్టి చేయును. గుణకర్మానుసారముగ సృష్టియందు బరివర్త నముజరుగదు. ప్రాక్తనకర్మానుసారమన్ని కార్యములు జరుగును.

ఈ విషయము నాస్తికులందఱు సమ్మతించెదరు. వాస్తవమున సింహదంపతులకు బుట్టింది శౌర్య ధైర్యాది గుణకర్మములతోడ నెప్పారు సింహముయగును. గుణకర్మలు లేకున్నను సింహమునకు సింహికి బట్టినది జాతిసింహమగును. సింహ మిథునమునకు జన్మించుకున్నను శౌర్య ఆర్యాది గుణ మలు కలిగి యుండుటచే "సింహోదేవ దత్తః అని కూడ చెప్పబడుచున్నది. అట్లే బ్రాహ్మణ దంపతులకు జన్మించి శమదమాది బ్రాహ్మణోచిత కర్మలతోడ విల